English   

వారసులకి కూడా లైంగిక వేధింపులు తప్పట్లేదట

 Aishwarya Rajesh
2020-05-26 12:22:40

పదహారణాల తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్‌. తండ్రి వారసత్వాన్ని స్వీకరించి నటిగా రంగప్రవేశం చేసింది. అయితే మొదట్లో ఈమెకి హీరోయిన్‌ గా మంచి అవకాశాలు రాకపోయినా, నటిగా తనేమిటో నిరూపించుకోవాలని భావించిన ఆమె కాక్కముట్టై సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో ఏ హీరోయిన్‌ చేయనటువంటి సాహసం చేసి నటించారు ఐశ్వర్య. ఈ సినిమా దెబ్బకు ఇప్పుడు హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేశ్‌ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే మాతృభాష తెలుగులోకి ఎంట్రీ కూడా ఇచ్చి కొన్ని సినిమాలు చేస్తోంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఆమె చేసిన పాత్రకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఎవరూ ఊహించని విధంగా నటించి ఆమె మంచి మార్కులు సంపాదించింది. అయితే ఆమె తన కెరీర్ ఏమే కేక్ వాక్ కాదని చెప్పుకొచ్చింది. 

గతంలో చాలా మంది నటీమణులు చెప్పినట్టే ఈమె కూడా పరిశ్రమలో మీటూ ఉందని చెప్పుకొచ్చింది. అంతే కాక ఇకక్డ నటీమణులను చాలా తక్కువగా చూస్తుంటారని కామెంట్స్ చేసిందామె. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన కెరీర్ ఆరంభంలో లైంగిక వేధింపులతో పాటు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది ఆమె. నిజానికి ఆమె కొంచెం నల్లగా ఉంటారు, దీంతో ఆ రంగు విషయంలో చాలా మంది అవహేళన చేశారని చెప్పుకొచ్చింది. ఇలా హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చానంటే నువ్వు మెటీరియల్ కాదని ఓ స్టార్ డైరెక్టర్ అన్నారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక మరొకరు అయితే కమెడియన్ పక్కన తప్ప హీరో పక్కన నువ్వు సెట్ అవ్వనని అన్నారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆమె తండ్రి హీరోగా కొన్ని సినిమాలు చేయగా అత్త శ్రీ లక్ష్మి లేడీ కమెడియన్ గా తెలుగు, తమిళ ప్రేక్షకులకి సుపరిచితమే. 

More Related Stories