English   

RX 100 తో జాను జోడి..

jaanu
2020-01-25 21:15:32

కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్‌ఎక్స్ 100' సినిమా ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాతో తనను తాను నిరూపించుకున్నఅజయ్ భూపతి..'మహాసముద్రం' పేరుతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడని.. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసుకొని పలువురు హీరోలకు వినిపించాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ ఆ కథను చివరికి అక్కినేని నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలొచ్చాయి.

అయితే.. చైతూ-సమంత హీరో హీరోయిన్లుగా అనుకున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు చైతూ ఔట్ అయ్యాడట. దానికి కారణం.. నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడమేనంటున్నారు. దాని వల్ల ఈ సినిమాకు కాల్షీట్స్ సర్దుబాటు చేయలేకపోయాడట చైతూ. దాంతో చివరికి మహా సముద్రం సబ్జెక్ట్ శర్వానంద్ దగ్గరికొచ్చింది. శర్వా కూడా వెంటనే ఈ కథను ఓకే చేశాడట. అయితే.. హీరో మారిన సమంతనే ఇందులో హీరోయిన్ గా నటించనుందట.. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నట్టు సమాచారం. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. ఇకపోతే.. శర్వా, సమంత ప్రస్తుతం తమిళంలో సూపర్‌హిట్ అయిన '96' తెలుగు రీమేక్‌ 'జాను'లో కలిసి నటిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. దాంతో వీళ్లిద్దరి కాంబినేషన్ రిపీట్ కానుంది.

More Related Stories