English   

నాంది హిందీ రీమేక్ పై ఊహించని అప్డేట్

 Ajay Devgn
2021-06-25 15:12:37

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నుండి అనుకోని అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తో దిల్ రాజు సినిమా చేస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు తెలుగు తెలుగు సినిమాలను బాలీవుడ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రీమేక్ ను ప్రకటించారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ సినిమా టాలీవుడ్ లో అల్లరి నరేష్ హీరోగా నటించిన నాంది సినిమాకు రీమేక్ గా తెరకెక్కబోతుంది. గత కొద్ది రోజులుగా నాంది సినిమాకు రీమేక్ రాబోతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

కానీ దీనిపై సడెన్ గా ప్రకటన వచ్చేసరికి అంతా అవాక్కవుతున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ తో కలిసి అజయ్ దేవగన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తాన్నది ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే నటీనటులు ఇతర వివరాలపై కూడా స్పష్టత రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా దిల్ రాజు తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు తమిళ మరియు బాలీవుడ్ చిత్రాల్లో తన మార్క్ ను చూపించేందుకు సిద్ధమయ్యారు. మరి అక్కడ ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.
 

More Related Stories