English   

హైద‌రాబాద్ లో అజిత్ మ‌కాం..!

ajith
2018-05-03 19:58:39

స్టార్ హీరోల‌కు ఇప్పుడు ఇండ‌స్ట్రీతో ప‌నిలేదు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని అంతా ఇప్పుడు ఒక్క‌టే అయిపోయారు. ఏ భాష‌లో సినిమా ఐనా ఎక్క‌డైనా ఆడేస్తుంది. దాంతో హీరోల‌కు గిరాకీ కూడా అలాగే ఉంది. అజిత్ కు అయితే మరీనూ. ఈయ‌న‌కు తెలుగులో కూడా ప‌డి చ‌చ్చిపోయే అభిమానులు ఉన్నారు. అప్ప‌ట్లో కొన్ని విజ‌యాలు వ‌చ్చాయి క‌దా అదే గుర్తింపు ఇంకా కొన‌సాగుతుంది. ఇక ఇప్పుడు ఈయ‌న కొత్త సినిమా షూటింగ్ అంతా హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న ఆస్థాన ద‌ర్శ‌కుడు శివ‌తో విశ్వాసం సినిమా చేస్తున్నాడు. ఈయ‌న‌పై అంత విశ్వాసం ఏంటో కానీ మ‌రో ద‌ర్శ‌కున్ని ప‌ట్టించుకోకుండా వ‌ర‌స‌గా ఈయ‌న‌కే ఛాన్సులిస్తున్నాడు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్ అయిపోయింది. అది హైద‌రాబాద్ లోనే జ‌రిగింది. ఇక ఇప్పుడు మే 7 నుంచి సిటీలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. 100 కోట్లతో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో అజిత్ పైలైట్ గా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది. 

నాలుగేళ్ల‌ కింద అజిత్ తో వీర‌మ్ చేసి సూప‌ర్ హిట్ అందుకున్నాడు శివ‌. తెలుగులో శౌర్యం, శంఖం, ద‌రువు లాంటి సినిమాలు చేసిన శివ‌.. త‌మిళ‌నాట సిరుత్తైతో పాపుల‌ర్ అయ్యాడు. ఆ త‌ర్వాత అజిత్ వీర‌మ్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. అది మొద‌లు అజిత్ కు ఫ్యాన్ అయ్యాడు.. ఆ త‌ర్వాత ట్యూన్ అయ్యాడు. వ‌ర‌స‌గా ఆయ‌న‌తో సినిమాలు చేస్తున్నాడు. వీర‌మ్ అయిపోయింది.. వేద‌లం అయిపోయింది.. ఈ మ‌ధ్యే వివేగం కూడా అయిపోయింది. ఇది ఫ్లాపైంది. అయినా కానీ ఇప్పుడు నాలుగోసారి శివ‌తోనే సినిమాకు రెడీ అయ్యాడు అజిత్. ఈ కాంబినేష‌న్ కు మ‌రో ప్ర‌త్యేక‌థ కూడా ఉంది. వీళ్లు కేవ‌లం వి అనే అక్ష‌రంతోనే టైటిల్స్ పెట్టుకుంటారు పైగా చివ‌ర్లో సున్నా ఉంటుంది. వీర‌మ్.. వేదాలం.. వివేగం.. ఇప్పుడు విశ్వాసం అంటూ వ‌స్తున్నారు అజిత్, శివ‌. వీళ్ల‌ను చూస్తుంటే క‌థ కంటే ముందు టైటిల్ బాగుంటే చాలు అనుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది. మ‌రి వివేగంతో అజిత్ కు షాక్ ఇచ్చిన శివ‌.. ఈ సారి ఏం చేస్తాడో..?

More Related Stories