English   

మరికొన్ని గంటల్లోనే మెహబూబా

Mehbooba-trailer
2018-04-09 16:04:50

ఒకప్పుడు స్టార్  డైరెక్టర్ గా ఉన్న పూరీ జగన్నాథ్.. ఇప్పుడా స్టార్డమ్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ కథ చేసినా పోకిరి చుట్టూ, లేదంటే ఇడియట్ చుట్టూ మాత్రమే తిప్పేస్తూ తిప్పలు పడుతోన్న పూరీ.. లేటెస్ట్ గా తనయుడు ఆకాశ్ పూరీతో ఓ సినిమా చేశాడు. ఆ సినిమానే మెహూబాబా. ఆకాశ్ సరసన నేహాశెట్టి కథానాయికగా నటిస్తోంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ తో మైండ్ బ్లోయింగ్ అనిపించాడు పూరీ. ఎలాగైనా ఆకాశ్ ను హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో  అతను సక్సెస్ అవుతాడు అనడానికి సాక్ష్యం గా దిల్ రాజు చేరాడు. ఈ మూవీని అతనే రిలీజ్ చేయబోతున్నాడు. సినిమా బాగా నచ్చితే తప్ప దిల్ రాజు ఓ పట్టాన సినిమాను ఇష్టపడడు. ఇప్పుడీ మూవీ రిలీజ్ చేసేందుకూ ఒప్పుకున్నాడంటే పూరీ అవుట్ పుట్ మారినట్టే అనుకోవచ్చు. 

ఇక టీజర్ తో అద్భుతం అనిపించిన పూరీ జగన్నాథ్ మరికొన్ని గంటల్లో ఈ మెహబూబా ట్రైలర్ ను విడదల చేయబోతున్నాడు. ఏప్రిల్ 9సాయంత్రం 5 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. దీన్ని బట్టి ఈ మూవీ రేంజ్ ను అంచనా వేయొచ్చు. ఆకాశ్ పూరీ ఈ మూవీలో ఓ యంగ్ సోల్జర్ గా కనిపిస్తున్నాడు. ఆ మధ్య పూరీ చెప్పినట్టు ఇది ఇండో పాక్ నేపథ్యంలో సాగే ప్రేమకథ. ఆ కథకు అదిరిపోయే విజువల్స్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు పూరీ అని ఎంటైర్ టీమ్ ఇప్పటికే కాన్ఫిడెంట్ గా ఉంది. ఖర్చు కూడా భారీగానే పెట్టినట్టు టీజర్ చూస్తేనే తెలిసింది. ఇక ఈ ట్రైలర్ తో మెహబూబాపై ఓ పూర్తి అంచనాకు రావొచ్చు. అంచనాల సంగతి ఎలా ఉన్నా.. దిల్ రాజు అండతో ఎంత పోటీ ఉన్నా మే 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నాడు పూరీ జగన్నాథ్. సో ప్రస్తుతానికైతే స్టే ట్యూన్ ఫర్ ట్రైలర్.. 

More Related Stories