English   

అఖిల్ కోసం స్టార్ డైరెక్ట‌ర్ ను సెట్ చేసిన నాగ్

Akhil Akkineni
2021-05-14 17:54:58

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే అఖిల్ ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఒక్క హిట్ కూడా కొట్ట‌లేక పోయాడు. ఇక ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచుల‌ర్ సినిమాతో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు వ‌స్తున్నారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తుండ‌గా..బాస్క‌ర్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అంతే కాకుండా క్రేజీ డైరెక్టర్ సురేంద‌ర్ రెడ్డి తో ఓ సినిమాను ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నిపించ‌ని విధంగా ఏజెంట్ లో అఖిల్ క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లు ఇప్ప‌టికే విడుద‌ల అక్కినేని అభిమానుల‌కు కిక్ ఇచ్చేశాయి. 

ఇదిలా ఉండ‌గా ఇప్పుడు మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్ సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నార‌ట‌. అఖిల్ ను ఎలాగైనా నిల‌బెట్టాల‌ని డిసైడ్ అయిన నాగార్జున అఖిల్ కోసం కొర‌టాల శివ‌ను సెట్ చేశార‌ట‌. ఇప్ప‌టికే నాగార్జున కొర‌టాల శివ తో చ‌ర్చించ‌గా ఆయ‌న పాజిటివ్ గా స్పందించిన‌ట్టు తెలుస్తోంది. ఇక అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉంటే కొర‌టాల ప్ర‌స్తుతం మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త‌ర‌వాత ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. 

More Related Stories