English   

ప్రేమ‌లో ప‌డ్డ అఖిల్..

akhil akkineni
2018-02-23 16:34:26

అదేంటి.. ఆ మ‌ధ్య బ్రేకప్ అయిపోయింది క‌దా..! నిశ్చితార్థం త‌ర్వాతే కదా ఇద్ద‌రూ బ్రేకప్ అయ్యారు.. అప్పుడే మ‌ళ్లీ ప్రేమేంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఉంది క‌దా అస‌లు ట్విస్ట్. ఒక్క ఫ్లాప్ వ‌స్తే.. ఎప్పుడెప్పుడు సినిమా చేసి మ‌ళ్లీ హిట్ కొడదామా అనే క‌సితో ఉంటారు హీరోలు. ఎందుకంటే ఇప్పుడున్న పోటీలో ఫ్లాప్ ప‌డితే రేస్ లో వెన‌క బ‌డిపోయిన‌ట్లే. స్టార్ హీరోల సంగ‌తేమో కానీ కుర్ర హీరోలైతే ఫ్లాప్ ఇస్తే రేస్ లో వెన‌క్కి వెళ్లిపోవ‌డం ఖాయం. ఇది తెలిసినా కూడా అఖిల్ మాత్రం మార‌ట్లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్నాడు. ఈ హీరో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి మూడేళ్లైపోయింది. చేసింది రెండు సినిమాలు. తొలి సినిమాకు.. రెండో సినిమాకు మ‌ధ్య గ్యాప్ రెండేళ్ల‌కు పైనే. ఇదే అఖిల్ కొంప ముంచేసింది. మ‌ళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేస్తున్నాడు సిసింద్రీ. డిసెంబ‌ర్ లో అఖిల్ తో పాటే వ‌చ్చిన నాని.. ఎంసిఏ త‌ర్వాత కృష్ణార్జున యుద్ధం షూట్ పూర్తి చేసాడు. కానీ ఇప్ప‌టికీ అఖిల్ మాత్రం మూడో సినిమాపై క్లారిటీ ఇవ్వ‌డం లేదు. ఆ మ‌ధ్య స‌త్య‌ప్ర‌భాస్ పినిశెట్టితో సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది కానీ ఇప్ప‌టికీ దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు అఖిల్.

ఇప్పుడు సుకుమార్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ లో క‌థ కూడా సిద్ధ‌మైపోయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.  అయితే ఈ సినిమా కూడా ఇప్పుడు మిస్ అయిపోయింది. అయితే మైత్రి మూవీ మేక‌ర్స్ సినిమా మాత్రం అలాగే ఉంది. కాక‌పోతే సుకుమార్ స్థానం లోకి వెంకీ అట్లూరి వ‌చ్చి చేరాడు. అవును.. ఈ మ‌ధ్యే తొలిప్రేమ‌తో క్లాసిక్ హిట్ అందుకున్న వెంకీ ఇప్పుడు అఖిల్ తో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ విష‌యంపై కన్ఫ‌ర్మేష‌న్ రాక‌పోయినా క్లారిటీ అయితే వ‌చ్చింది. ఇప్ప‌టికే వెంకీ చెప్పిన క‌థ అఖిల్ కు న‌చ్చ‌డం.. చేస్తాన‌ని చెప్ప‌డం కూడా జ‌రిగిపోయింది. అయితే ఇది ఇప్పుడు ఉండ‌క‌పోవచ్చు. వెంకీ అట్లూరి మొన్న తొలిప్రేమ‌తో హిట్ కొట్టాడు. ఇప్పుడు పూర్తి క‌థ సిద్ధం చేయ‌డానికి మ‌రో ఆర్నెళ్లైనా ప‌డుతుంది. అందుకే జూన్ త‌ర్వాత అఖిల్ మూడో సినిమా ఉండొచ్చ‌ని తెలుస్తుంది. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. అప్ప‌టి వ‌ర‌కు అఖిల్ ఆగుతాడో.. లేదంటే గ్యాప్ ఉంది క‌దా మ‌రో సినిమా చేస్తాడో..?

More Related Stories