English   

అఖిల్ కు ఇప్పుడు అది అవ‌స‌ర‌మా..? 

Akhil-Bollywood
2018-08-06 12:35:57

ఓ ప‌ని అయిన త‌ర్వాత అరే ఇలా చేసుండ‌కూడ‌దు అని ఆలోచించినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. చేసేముందు ఒక్క‌సారి ఆలోచిస్తే అలా బాధ ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కానీ ఆ ఆలోచ‌న లేకే ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోలు ఇబ్బందుల్లో ప‌డుతుంటారు. అఖిల్ కూడా తొలి సినిమా విష‌యంలో ఇదే చేసాడు. తొంద‌ర‌ప‌డి వినాయ‌క్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ ఉన్నాడు క‌దా అని ప‌క్కా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేసాడు. ఫలితం చ‌రిత్ర‌లో నిలిచే ఓ డిజాస్ట‌ర్ తో ఇండ‌స్ట్రీకి రావ‌డం. ఆ త‌ర్వాత హ‌లో అంటూ మంచి సినిమా చేసినా ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు మ‌రోసారి ప్రేమ‌క‌థ తీసుకుని ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు అఖిల్. ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది. కానీ అంత‌లోనే ఈయ‌న‌కు బాలీవుడ్ వెళ్లాల‌నే ఆశ పుట్టింది. అది కూడా క‌ర‌ణ్ జోహార్ చేతుల మీదుగా అక్క‌డ ప‌రిచ‌యం అవుతాడ‌నే హాట్ న్యూస్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తుంది. స‌త్య‌ప్ర‌భాస్ చెప్పిన క‌థ అఖిల్ కు బాగా న‌చ్చడంతో నాలుగో సినిమా ఈయ‌న‌తో క‌మిటైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 

నిజానికి వెంకీ అట్లూరి కంటే ముందే ప్ర‌భాస్ సినిమా క‌థ విన్నాడు అఖిల్. అయితే అప్పుడే మ‌రో ప్ర‌యోగం చేయ‌డం ఎందుకు రిస్క్ అని తెలిసి కాస్త వెన‌క్కి త‌గ్గాడు. కానీ ఈ క‌థ ఇంకా అఖిల్ బుర్ర‌లోనే ఉంది. అందుకే వెంకీ సినిమా త‌ర్వాత ఈ చిత్రం చేసేలా ఉన్నాడు ఈ సిసింద్రీ. ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. ఈ చిత్రానికి నిర్మాత క‌ర‌ణ్ జోహార్. ఈ మ‌ధ్యే అఖిల్, క‌ర‌ణ్ జోహార్ క‌లిసి ఫోటో కూడా షేర్ చేసారు. ఈ క‌థంతా గుర్రాల చుట్టూ తిరుగుతుంద‌ని.. ఇందులో అఖిల్ పాత్ర చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంద‌ని తెలుస్తుంది. బాలీవుడ్ కు కూడా క‌నెక్ట్ అయ్యే స్కోప్ ఉండ‌టంతో ఈ సినిమాను త‌నే నిర్మిస్తానంటున్నాడు క‌ర‌ణ్. అన్న‌ట్లు ఈయ‌న నిర్మిస్తోన్న బ్ర‌హ్మ‌స్త్ర‌లో నాగార్జున కూడా న‌టిస్తున్నాడు. ఇప్పుడు త‌న‌యుడితోనూ సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నాడు. మ‌రి ఇప్పుడు నిజంగానే అఖిల్ కు బాలీవుడ్ అంత అవ‌స‌ర‌మా..? 

More Related Stories