English   

గాళ్ ఫ్రెండ్ తో అఖిల్ బిజీ..

akhil busy with his third movie

ఇప్ప‌టికే ఓ సారి బ్రేక్ అప్ అయింది క‌దా..! పెళ్లి వ‌ర‌కు వ‌చ్చిన తంతు ఆగిపోయింది క‌దా.. అప్పుడే మ‌రో అమ్మాయిని అఖిల్ ప్రేమించేసాడా.. మ‌రీ ఇంత ఫాస్టా అనుకుంటున్నారా..? అదేం లేదండి.. ప్ర‌స్తుతం అఖిల్ త‌న మూడో సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రం పనుల్లోనే పూర్తిగా మునిగిపోయాడు. మ‌రి గాళ్ ప్రెండ్ తో బిజీ ఏంటి అనేగా అనుమానం. ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది.. అఖిల్ ఏ సినిమా చేస్తుంటే ఆ ద‌ర్శ‌కుడే అక్కినేని వార‌సుడికి గాళ్ ప్రెండ్. ఆ ఆర్నెళ్లు అత‌డితోనే ఫుల్లుగా తిరిగేస్తుంటాడు.. ఫోన్లు మాట్లాడేస్తుంటాడు. ప్ర‌స్తుతం వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు కాబ‌ట్టి ఈయ‌నే అఖిల్ గాళ్ ఫ్రెండ్. ఇద్ద‌రు కుర్రాళ్ళే కదా.. పైగా ప్రేమ‌క‌థ చేస్తున్నారు.. దాంతో త‌న బాయ్ ఫ్రెండ్ అయిన గాళ్ ఫ్రెండ్ తో బాగానే ప్రేమించుకుంటున్నాడు అఖిల్. ఈ చిత్ర షూటింగ్ లండ‌న్ లోనే ఎక్కువ భాగం జ‌ర‌గ‌నుంది. తొలిప్రేమ కూడా అక్క‌డే చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌ళ్లీ ఇప్పుడు అఖిల్ కోసం కూడా అక్క‌డికే వెళ్తున్నాడు. మ‌రి తొలిప్రేమ మాదిరే ఇది కూడా హిట్ అవుతుందా..? అఖిల్ కోరుకున్న తొలి విజ‌యాన్ని వెంకీ ఇస్తాడా..? ఇదే ఏడాది ద‌స‌రాకు సినిమా విడుద‌ల ప్లాన్ చేస్తున్నారు. 

More Related Stories