English   

అఖిల్ ను ఆపేస్తున్న అధికారులు.. 

Akhil-venky atluri
2018-06-18 08:08:58

ఏ అధికారులు ఎందుకు ఆపుతున్నారు..? అఖిల్ తో ఆ అధికారుల‌కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? ఈయ‌న కొత్త సినిమా ఇంకా ప‌ట్టాలెక్క‌క పోవ‌డానికి కార‌ణాలు చాలానే ఉన్నాయి. అన్నీ కుదిర్తే ఈ పాటికే అఖిల్ మూడో సినిమా ప‌ట్టాలెక్కేసి.. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకోవాలి. లండ‌న్లో షూటింగ్ అంటూ అప్పుడెప్పుడో అనౌన్స్ చేసాడు వెంకీ అట్లూరి. దాదాపు 70 శాతం షూటింగ్ అక్క‌డే జ‌రగ‌బోతుంది. దీనికోసం యూనిట్ అంద‌రికీ వీసా కావాలి క‌దా..! కానీ అంత మందికి ఒకేసారి వీసా రావ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఇక్క‌డే అస‌లు తేడా వ‌చ్చేసింది. ఈ వీసాలు ఆల‌స్యం కావ‌డం వ‌ల్లే షూటింగ్ కూడా ఆల‌స్యం అవుతుంది. జూన్ 20 నుంచి ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌బోతుందని తెలుస్తుంది. అఖిల్ కు జోడీగా ఇందులో నిధి అగ‌ర్వాల్ న‌టించ‌బోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ చిత్రాన్ని మూడు నెల‌ల్లోనే పూర్తి చేసి.. ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నేది వెంకీ ప్లాన్. మ‌రి ఇంత త‌క్కువ టైమ్ లో సినిమా పూర్తి చేస్తాడా.. ఈ వీసా స‌మ‌స్య‌లు అఖిల్ ను ఎప్పుడు వీడిపోతాయి అనేది చూడాలిక‌..!

More Related Stories