English   

గ్రీకు యువరాణితో అఖిల్ రొమాన్స్ 

Farah-Karimaee
2018-07-17 15:50:32

అరంగేట్రం హంగులతో ఉన్నా.. అదృష్టం కలిసిరాని స్టార్ అఖిల్. అక్నినేని ఇంటి నుంచి మూడో తరం హీరోగా పరిచయమైన అఖిల్ ను ఇంత వరకూ మంచి విజయం పలకరించలేదు. ప్రస్తుతం మూడో సినిమా చేస్తున్నాడీ హలో బాయ్. తొలిప్రేమతో మంచి విజయం అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీలో అఖిల్ ఓ గ్రీకు యువరాణితో రొమాన్స్ చేయబోతున్నాడు. గ్రీకు యువరాణి అంటే నిజంగా కాదులెండి.. గతంలో బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో గ్రీకు యువరాణిగా నటించిన బ్యూటీ గుర్తుందా.. తన పేరు ఫరా కరిమే. ఆ సినిమాలో బాలయ్యను వలలో వేసుకోవడానికి వయ్యారాలు పోయిన ఈ భామలో సోయగాలు చాలానే ఉన్నాయి.  ఇప్పుడా బ్యూటీనే అక్కినేని అఖిల్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేయబోతోంది. గౌతమీపుత్రలో చిన్న పాత్రే చేసినా తనదైన ముద్ర వేసింది. కానీ ఆ ముద్ర అందరికీ గుర్తుండేలా పడలేదు. దీంతో ఇప్పుడీ ఐటమ్ సాంగ్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోందీ బ్యూటీ. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీల ఫరా ఐటమ్ సాంగ్ కూడా అక్కడే చిత్రీకరించబోతున్నారని సమాచారం. 
 

More Related Stories