English   

ప్ర‌భాస్ సినిమాకు క‌మిటైన అఖిల్..

Satya-Prabhas
2018-07-20 14:41:56

అవునా.. ప్ర‌భాస్ తో అఖిల్ సినిమా చేస్తున్నాడా..? అంటే మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నారా ఏంటి..? అయినా అఖిల్, ప్ర‌భాస్ ఇమేజ్ కి చాలా తేడా ఉంది క‌దా ఈ కాంబినేష‌న్ ఎలా క‌లిసింది అనుకుంటున్నారా..? ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ఇక్కడ ప్ర‌భాస్ అంటే హీరో కాదు.. ద‌ర్శ‌కుడు. స‌త్య ప్ర‌భాస్ పినిశెట్టి.. హీరో ఆది పినిశెట్టి వాళ్ల అన్న‌య్య‌.. ర‌విరాజా పినిశెట్టి కొడుకు. హ‌లో సినిమా త‌ర్వాత అఖిల్ లో కావాల్సినంత క్లారిటీ వ‌చ్చింది. మాస్ వైపు అడుగులు వేసేకంటే మంచి క‌థ‌లు చేస్తే స‌రిపోతుంద‌ని ఫిక్సైపోయాడు అఖిల్. అందుకే అఖిల్ కూడా తండ్రి లాగే ఆలోచిస్తున్నాడు. ఇక‌పై క‌థ కొత్త‌గా ఉంటే చాలు.. మాస్ ఇమేజ్ అవ‌స‌రం లేద‌నుకుంటున్నాడు ఈ హీరో. దానికి త‌గ్గ‌ట్లే ఇప్పుడు స‌త్య‌ప్ర‌భాస్ తో సినిమా క‌మిటైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
నిజానికి వెంకీ అట్లూరి కంటే ముందే ప్ర‌భాస్ సినిమా క‌థ విన్నాడు అఖిల్. అయితే అప్పుడే మ‌రో ప్ర‌యోగం చేయ‌డం ఎందుకు రిస్క్ అని తెలిసి కాస్త వెన‌క్కి త‌గ్గాడు. కానీ ఈ క‌థ ఇంకా అఖిల్ బుర్ర‌లోనే ఉంది. అందుకే వెంకీ సినిమా త‌ర్వాత ఈ చిత్రం చేసేలా ఉన్నాడు ఈ సిసింద్రీ. ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. ఈ చిత్రానికి నిర్మాత రానా. అవును.. అక్కినేని వార‌సుడితో ద‌గ్గుపాటి వార‌సుడు నిర్మాత‌గా ఓ సినిమా చేయ‌బోతున్నాడు. మొత్తానికి అప్పుడు నితిన్ తో.. ఇప్పుడు రానాతో.. ఇలా హీరోలంద‌ర్నీ నిర్మాత‌లుగా మార్చేస్తున్నాడు అఖిల్. అలా హీరో ప్ర‌భాస్ తో కాక‌పోయినా.. ద‌ర్శ‌కుడు స‌త్య‌ప్ర‌భాస్ తో ఈయ‌న సినిమా చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ రానుంది. 

More Related Stories