English   

అఖిల్ తొలిప్రేమ నిజమే.. 

Akhil-akkineni

అన్నీ ఉన్నా రిలీజ్ డేట్లో శని అన్నట్టుగా ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు అక్కినేని అఖిల్. ఫస్ట్ మూవీ డిజాస్టర్. సెకండ్ మూవీ హిట్ అనిపించుకున్నా శాటిస్ ఫ్యాక్షన్ లేదు. దీంతో అఖిల్ కొంత డిప్రెస్ అయినట్టు కనిపించాడు. కానీ నాగ్ సపోర్ట్ తో థర్డ్ మూవీకి రెడీ అయ్యాడు. అది కూడా తొలిప్రేమ దర్శకుడితో. రీసెంట్ గా తొలిప్రేమతో పెద్ద హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరితోనే అఖిల్ థర్డ్ మూవీ సెట్ అయింది. నిన్నటి వరకూ చాలామంది దర్శకుల పేర్లు వినిపించినా ఫైనల్ గా వెంకీకే ఓటేశాడు అఖిల్. అతని తొలిప్రేమకు నాగ్ అండ్ టీమ్ ఇంప్రెస్ అయ్యే అఖిల్ ను కూడా తొలి హిట్ పడేయాల్సిన బాధ్యత అతనికే ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. 

అఖిల్ లో ఛరిష్మా ఉంది. కానీ దాన్ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేసే దర్శకుడు లేడు. లేదంటే దర్శకులు చెప్పిన దానికంటే తనను తాను ఎక్కువగా ఊహించుకుని ఉండవచ్చు. అది కూడా కొంత వరకూ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకే అఖిల్ కు అన్నీ ఉన్నా హీరో మెటీరియల్ గా ఆడయన్ప్ యాక్సెప్టెన్సీ సంపాదించుకోలేకపోతున్నాడు. ఇలాంటి తరుణంలో బ్యాక్ గ్రౌండ్ కు తగ్గట్టుగా కాకుండా పర్సనాలిటికీ తగ్గ కథలు సెలెక్ట్ చేసుకోవాలి. ముందు హిట్లు కొడితే తర్వాత అతను ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయొచ్చు. అంతే కానీ మాస్ హీరోలుగా ప్రేక్షకులపై రుద్దబడకూడదు కదా. అయితే వెంకీ అట్లూరి ఫస్ట్ మూవీతోనే సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అతని సెన్సిబిలిటీస్ లోకి అఖిల్ వెళ్లగలిగితే దర్శకుడు కూడా ఏదైనా మ్యాజిక్ చేసే చాన్సుంటుంది. మొత్తంగా అఖిల్ మూడో సినిమా సెట్  అయింది. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో..

More Related Stories