English   

 అఖిల్ అక్క‌డ మొద‌లుపెట్టాడు..!

akhil

కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా త‌న సినిమా షూటింగ్ మొద‌లు పెట్టాడు అఖిల్. వెంకీ అట్లూరితో ఈయ‌న చేస్తోన్న సినిమా తొలి రోజు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ట్వీట్ కూడా చేసాడు అఖిల్. ఇందులో అన్న‌య్య హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ తో జోడీ క‌డుతున్నాడు అఖిల్. స్టిల్ లో నిధి కూడా క‌నిపించింది. ఇందులో అఖిల్ ప్లే బాయ్ గా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. లండ‌న్ లో షూటింగ్ మొద‌లైంది. అక్క‌డే 70 శాతం షూటింగ్ జ‌రగ‌బోతుంది. అంత‌మందికి ఒకేసారి వీసాలు రావ‌డం క‌ష్టం కాబ‌ట్టే ఇన్నాళ్లూ ఈ చిత్ర షూటింగ్ కాస్త ఆల‌స్యం అయింది. నాన్ స్టాప్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు వెంకీ. ఈ చిత్రాన్ని మూడు నెల‌ల్లోనే పూర్తి చేసి.. ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నేది వెంకీ ప్లాన్. మ‌రి ఇంత త‌క్కువ టైమ్ లో సినిమా పూర్తి చేస్తాడా అనేది కాస్త అనుమాన‌మే కానీ ఈ చిత్రం మాత్రం అఖిల్ కు కీల‌కం. ఎందుకంటే అఖిల్.. హ‌లో ఫ్లాపుల‌తో ఈ కుర్ర హీరో ఇప్పుడు బాగా వెన‌క‌బ‌డిపోయాడు. ఇలాంటి టైమ్ లో తొలిప్రేమ ద‌ర్శ‌కున్ని న‌మ్ముకుంటున్నాడు. త‌న‌కు అచ్చొచ్చిన ప్రేమ‌క‌థ‌నే మ‌ళ్లీ న‌మ్ముకుంటున్నాడు ఈ హీరో. హ‌లో ఫ్లాపైనా పేరైతే తీసుకొచ్చింది. మ‌రి ఈ సారి ఏం జ‌రుగుతుందో చూడాలిక‌..!

More Related Stories