English   

అఖిల్ కు హీరోయిన్ దొరికిందా..?

akhil-3movie

అక్కినేని అఖిల్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆల్రెడీ చేసిన రెండు సినిమాలూ అతనికి ఏ గుర్తింపూ ఇవ్వలేకపోయాయి. దీంతో అఖిల్ కెరీర్ విషయంలో నాగార్జున కొంత టెన్షన్ గా ఉన్నాడనేది వాస్తవం. ఈ క్రమంలో రీసెంట్ గా తొలిప్రేమతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా మొదలైంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ అఖిల్ చేసిన రెండు సినిమాల్లోనూ ఇద్దరూ కొత్త హీరోయిన్లనే తీసుకున్నారు. కానీ ఈ సారి అందరికీ తెలిసిన భామను తీసుకోవాలనే ప్రయత్నిస్తున్నారు. ఫైనల్ గా వారి ప్రయత్నం ఫలించినట్టే అంటున్నారు. వరుసగా నితిన్ తోనే రెండు సినిమాలు చేసిన లై బ్యూటీ మేఘా ఆకాశ్ ను అఖిల్ సరసన హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. 

లైతో యూత్ ను బాగా ఆకట్టుకుంది మేఘా ఆకాశ్. ప్రస్తుతం నితిన్ తోనే ఛల్ మోహన్ రంగాలో నటించింది. ట్రైలర్, ప్రోమోస్ లోనూ చాలా అందంగా కనిపిస్తోందీ బ్యూటీ. అటు తమిళ్, మళయాలంలోనూ నటిస్తోన్న మేఘాకు ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాల్లేవు. దీంతో అఖిల్ ఆఫర్ కాదనే అవకాశం లేదు. అంటే ఆల్మోస్ట్ అఖిల్ కు జోడీగా మేఘా ఫిక్స్ అయినట్టే అనుకోవచ్చు. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాపై అఖిల్ తో పాటు నాగార్జున కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఈ మూవీతో అయినా కుర్రాడు కమర్షియల్ హిట్ కొడతాడా..?

More Related Stories