English   

అఖిల్ సినిమా మొదలైంది

Akhil-venki-atluri
2018-03-26 19:12:51

అక్కినేనిన అఖిల్ థర్డ్ మూవీ మొదలైంది. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇవాళ అన్నపూర్ణ స్టూడియో సినిమా షూటింగ్ అఫీషియల్ గా ప్రారంభమైంది. అక్కినేని ఫ్యామిలీ అంతా ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరైంది. విశేషం ఏంటంటే ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి మళయాల యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సాల్మన్ హాజరయ్యాడు. అతనే ఫస్ట్ షాట్ కు కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. ప్రస్తుతం దుల్కర్ మహానటి సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెబుతున్నాడు. అందుకే అతన్ని గెస్ట్ గా పిలిచినట్టున్నారు. మొత్తంగా వెంకీకి రెండో సినిమా చేయడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. అన్నపూర్ణ క్యాంప్ అని చెప్పలేం కానీ.. అక్కినేని హీరోతో చాన్స్ అంటే చిన్నవిషయమేం కాదు. ఈసినిమా బావుంటే నెక్ట్స్ చైతన్య కూడా చాన్స్ ఇచ్చే చాన్స్ ఉంటుంది.  అఖిల్.. అఖిల్ తో పరిచయమైనా ఆ సినిమా డిజాస్టర్ తో కుంగిపోయాడు. నెక్ట్స్ హలో అన్నాడు. సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ కమర్షియల్ రెస్పాన్స్ ఆ స్థాయిలో రాలేదు. దీంతో ఇప్పుడీ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు అఖిల్. ఇక తొలిప్రేమ ఫస్ట్ మూవీ అయినా మంచి ఎమోషన్స్ ను పండించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఆ సీన్స్ బాగా రాసుకున్నాడు కూడా. సో ఈ మూవీతో మరోసారి అవే ఎమోషన్స్ తో అఖిల్ కు మంచి హిట్ ఇస్తాడేమో చూడాలి. థమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మే నుంచి ప్రారంభం కానుంది. 

More Related Stories