English   

అక్షర మూవీ రివ్యూ

Akshara
2021-02-26 12:36:42

చిన్ని కృష్ణ దర్శకత్వం లో హీరోయిన్ నందిత శ్వేత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం "అక్షర". విద్యావ్యవస్థ లో ఉన్న లోపాలు...విద్యావ్యవస్థ లో కార్పోరేట్ దోపిడీ ని ప్రశ్నించే కథ తో వచ్చిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్లు కూడా గట్టిగానే చేయడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అంచనాలను రీచ్ అయ్యిందా.?లేదా? ఇప్పుడు చూద్దాం.

కథ & కథనం: విద్యా విధాన్ అనే సంస్థలో అక్షర (నందిత శ్వేత) టీచర్ గా జాయిన్ అవుతుంది.  అయితే అదే స్కూల్ కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్న శ్రీతేజ్ (శ్రీతేజ్) అక్షర వెంటపడుతుంటారు. అదే కాలనీలో వాల్తేర్ బాయ్స్ గా చలామణి అయ్యే మధు సుంధన్, సత్య, శంకర్ లు కూడా అక్షర వెంట పడుతూ ఉంటారు. ఒకరికి తెలియ కుండా మరొకరు అక్షర ను ప్రేమిస్తున్నామని వెంటపడుతుంటారు. అక్షర మాత్రం విద్యావ్యవస్థ పై పోరాటం చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా తన వెంటపడుతున్న నలుగురికి అక్షర షాక్ ఇస్తుంది. అక్షర విద్యా వ్యవస్థపై చేస్తున్న పోరాటం ఫలిస్తుందా..? అంతే కాకుండా శ్రీతేజ్ అక్షర వెంట పడటం తో అతడిని అక్షర కాల్చేస్తుంది. అంతే కాకుండా మరో పోలీస్ ఆఫీసర్ ను కూడా అక్షర చంపేస్తుంది. అసలు అక్షర ఎందుకు ఇలా చేసింది. సినిమాలో షకలక శంకర్, అజయ్ గోష్, మధు నందన్, సత్యల పాత్రలు ఏంటి అన్నది కథ.

విశ్లేషణ : మార్కులు ర్యాంకుల గొడవ కారణంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకొంటున్నారో చూపించడం అక్షర సినిమా. కానీ సినిమాలో అనవసర కామెడీ ని చొప్పించి అసలు కాన్సెప్ట్ ను చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. వ్యవస్థ లో ఉన్న ముఖ్యమైన అంశాన్ని తీసుకుని నాసిరకం కామెడీ చొప్పించడంతో కథ తేలిపోయింది. ఫస్ట్ హాఫ్ లో కామెడీని నమ్ముకున్న దర్శకుడు సెకండ్ హాఫ్ లో అసలు కథకు వచ్చేసరికి సమయం మించి పోయిందనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమా మరో లెవల్ కు వెళుతుందని భావించిన ప్రేక్షకులకు మళ్లీ నాసిరకం కామెడితో ఇన్వెస్టిగేషన్ ను నీరు కార్చారన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ సినిమాలో చివరి అరగంట సినిమాకు కీలకంగా మారిందని చెప్పొచ్చు. అక్షర బాల్యం లో ఎదురుకున్న పరిస్థితిలు భావోద్వేగాలతో కూడి ఉంటాయి. హర్షవర్ధన్ ఎపిసోడ్ బాగుంటుంది. విద్యావ్యవస్థ లో ఉన్న లోపాలు ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా చేస్తాయి. ఓవరాల్ గా దర్శకుడు ఎంతచుకున్న పాయింట్ బాగున్నప్పటికి ప్రెజెంట్ చేయడంలో తడపడ్డాడు.

More Related Stories