English   

 అక్ష‌య్ కుమార్.. నువ్వు గోల్డ్ సామి..!

Akshay-Kumar-Gold
2018-06-17 15:06:31

బాలీవుడ్ బంగారం ఎవ‌రంటే మ‌రో మాట లేకుండా అక్ష‌య్ కుమార్ అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈయ‌న‌కు క‌థ చెప్పాలంటే క‌ష్ట‌ప‌డాల్సిన ప‌ని లేదు. రొటీన్ కాకుండా కొత్త‌గా ఉంటే చాలు. మాస్ సినిమాల‌కు స‌ల్మాన్ ఉన్నాడు.. స్టైల్ కు షారుక్ ఉన్నాడు.. ప్ర‌యోగాల‌కు అమీర్ ఉన్నాడు.. కానీ అన్నీ క‌లిపి చేయ‌డానికి అక్ష‌య్ కుమార్ ఉన్నాడు. కొన్నేళ్లుగా త‌న సినిమాల‌తో మంచి చెబుతూనే.. క‌మ‌ర్షియ‌ల్ గానూ స‌క్సెస్ అవుతున్నాడు ఈ హీరో. బాలీవుడ్ లో బంగారం అయిపోతున్నాడు అక్ష‌య్ కుమార్. ఆయ‌న న‌టిస్తున్న సినిమా పేరు గోల్డ్. సినిమా టైటిల్ వ‌ర‌కే కాదు.. ఆయ‌న కూడా గోల్డే. సాయం చేయ‌డంలో అక్ష‌య్ ను మించిన వాళ్లు లేరు బాలీవుడ్ లో. వీధి బాల‌ల‌కు కూడా సాయం చేసే మ‌న‌స్త‌త్వం అక్ష‌య్ కుమార్ ది. ఇప్పుడు ఆయ‌న న‌టిస్తోన్న గోల్డ్ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. ఇది ఇప్పుడు ఇండియ‌న్ వైడ్ గా ట్రెండింగ్ అయిపోయింది. 1948లో ఇండియాకు హాకీలో ఉన్న తొలి ఒలంపిక్ బంగారు ప‌థ‌కం నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా గోల్డ్. రీమాఖ‌గ్టీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కురాలు. ఆగ‌స్ట్ 15న సినిమా విడుద‌ల కానుంది. ఇక ఇప్పుడు ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో నేష‌న‌ల్ ఆంథ‌మ్ ను హైలైట్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రం టీజ‌ర్ చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది ఇది కూడా ప‌క్కా హిట్ అని. మ‌రి చూడాలిక‌.. గోల్డ్ తో ఈ ఖిలాడీ ఎలా మాయ చేయ‌బోతున్నాడో..?

More Related Stories