English   

గోల్డ్ ట్రైల‌ర్.. బాబు నిజంగా బంగార‌మే..!

Akshay-Kumar
2018-06-25 20:48:16

బాలీవుడ్ బంగారం ఎవ‌రంటే మ‌రో మాట లేకుండా అక్ష‌య్ కుమార్ అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈయ‌న‌కు క‌థ చెప్పాలంటే క‌ష్ట‌ప‌డాల్సిన ప‌ని లేదు. రొటీన్ కాకుండా కొత్త‌గా ఉంటే చాలు. మాస్ సినిమాల‌కు స‌ల్మాన్ ఉన్నాడు.. స్టైల్ కు షారుక్ ఉన్నాడు.. ప్ర‌యోగాల‌కు అమీర్ ఉన్నాడు.. కానీ అన్నీ క‌లిపి చేయ‌డానికి అక్ష‌య్ కుమార్ ఉన్నాడు. కొన్నేళ్లుగా త‌న సినిమాల‌తో మంచి చెబుతూనే.. క‌మ‌ర్షియ‌ల్ గానూ స‌క్సెస్ అవుతున్నాడు ఈ హీరో. బాలీవుడ్ లో బంగారం అయిపోతున్నాడు అక్ష‌య్ కుమార్. ఆయ‌న న‌టిస్తున్న సినిమా పేరు గోల్డ్. సినిమా టైటిల్ వ‌ర‌కే కాదు.. ఆయ‌న కూడా గోల్డే. సాయం చేయ‌డంలో అక్ష‌య్ ను మించిన వాళ్లు లేరు బాలీవుడ్ లో. వీధి బాల‌ల‌కు కూడా సాయం చేసే మ‌న‌స్త‌త్వం అక్ష‌య్ కుమార్ ది. ఇప్పుడు ఆయ‌న న‌టిస్తోన్న గోల్డ్ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది ఇప్పుడు ఇండియ‌న్ వైడ్ గా ట్రెండింగ్ అయిపోయింది. 1936-1948 మ‌ధ్య స్వాతంత్ర్యం కోసం జ‌రిగిన పోరాటం మ‌ధ్య‌లోనే ఇండియ‌న్ హాకీ జ‌ట్టు చేసిన మ‌రో పోరాటం ఇది. అప్ప‌టి వ‌ర‌కు బ్రిటీష్ త‌ర‌ఫున ఆడి గెలిచిన మ‌న జుట్టు.. తొలిసారి మ‌న దేశం కోసం ఆడి గెలిచిన తొలి ఒలంపిక్ మెడ‌ల్ గెలుపు క‌థ ఇది. రీమాఖ‌గ్టీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కురాలు. ఆగ‌స్ట్ 15న సినిమా విడుద‌ల కానుంది. ఇందులో నేష‌న‌ల్ ఎమోష‌న్స్ ను బాగా హైలైట్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రం ట్రైల‌ర్ చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది ఇది కూడా ప‌క్కా హిట్ అని. మ‌రి చూడాలిక‌.. గోల్డ్ తో ఈ ఖిలాడీ ఎలా మాయ చేయ‌బోతున్నాడో..?

More Related Stories