English   

అక్షయ్ కుమార్ నెలసరి ఖర్చు తెలిస్తే షాక్ తప్పదు...

Akshay Kumar.jpg
2020-03-29 21:31:35

హీరో అంటే సినిమాల్లోనే కాదు.. బయట కూడా అలాగే ఉండాలి. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ను చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. తన వంతు సాయంగా ఎప్పుడూ ప్రజలకు సాయం చేస్తూనే ఉంటాడు ఈయన. తనకు దేవుడిచ్చిన దాంట్లోంచి బయటి వాళ్లకు పంచి పెట్టినపుడే కదా దానికి సార్థకథ ఉంటుంది అంటాడు ఈయన. ఇప్పుడు కూడా 25 కోట్లు విరాళంగా ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నాడు అక్షయ్ కుమార్. ఇలాంటి సమయంలో ఈయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా చెప్పింది. దాంతో పాటు అక్షయ్ కూడా ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూ చాలా విషయాలు చెప్పాడు.

షూటింగ్ ఉన్నా లేకున్నా అక్షయ్ కుమార్ దినచర్య ఉదయం 4 గంటలకే ప్రారంభం అవుతుందని చెబుతుంది ట్వింకిల్. బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీస్ ఉదయం వరకు పార్టీ చేసుకుని వచ్చి అప్పుడు పడుకుంటారు.. కానీ అక్షయ్ అప్పుడే లేస్తాడు. పైగా ఈయనకు పార్టీలు, పబ్బులు అలవాటు లేదు. ధూమపానం, మద్యపానానికి పూర్తిగా దూరం. అంతేకాదు.. రాత్రి 9.30 నుంచి 10 గంటల మధ్యలో కచ్చితంగా పడుకుంటాడు అక్షయ్ కుమార్. మళ్లీ వెంటనే 4 గంటలకు లేచి వర్కవుట్స్ చేస్తానని చెబుతున్నాడు ఈయన. షూటింగ్స్ కు ఆలస్యంగా వెళ్తే తన నిర్మాతలకు నష్టం కలుగుతుందనే విషయం ఎప్పుడూ బుర్రలోనే ఉంటుందని చెబుతున్నాడు ఈయన. ఇక ఎన్ని పనులున్నా కూడా తన కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం కచ్చితంగా ఇస్తానని.. అందులో కాంప్రమైజ్ అయ్యేది లేదంటున్నాడు ఈయన. డబ్బులొస్తున్నాయి కదా అని ఎక్స్ ట్రా పని చేయడం తన వల్ల కాదంటున్నాడు అక్షయ్. ఇక భార్యతో పడుకునే ముందు ప్రతీరోజూ భార్యతో పేకాట (రమ్మీ) ఆడటం అలవాటు. ఈ పేకాటలో ట్వింకిల్‌కు ఇప్పటి వరకు 4.5 లక్షల రూపాయలు బాకీ పడ్డానని చెప్పాడు ఈయన.

ఆ మధ్య కపిల్ శర్మ కామెడీ నైట్స్‌కు హాజరైన అక్షయ్ కుమార్ తన నెలసరి ఖర్చు పది వేల రూపాయలలోపే ఉంటుందని చెప్పి సంచలనం సృష్టించాడు. దాదాపు ఎక్కువంటే మూడు వేలకు మించి నా పాకెట్ మనీ ఖర్చు కాదని చెప్పాడు. తాను మద్యం తాగనని.. సిగరెట్లు తాగనని.. షూటింగులకు వెళ్తే నిర్మాతే నా ఖర్చంతా భరిస్తారని చెప్పాడు. ఇక నాకు ఏం ఖర్చు ఉంటుంది చెప్పండి అంటూ అక్షయ్ కుమార్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. అందుకే ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా సాయం చేయడానికి ముందుకొస్తాడు అక్షయ్ కుమార్.

More Related Stories