English   

అక్షయ్ కుమార్ సంచలనం.. PMరిలీఫ్ ఫండ్‌కు 25 కోట్ల విరాళం.. 

 Akshay Kumar
2020-03-28 19:05:49

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఊహించని సంచలనం సృష్టించాడు. ఒక్కటి రెండు కాదు.. ఏకంగా 25 కోట్ల విరాళం అందించాడు. కరోనా వైరస్ పై అంతా చేస్తున్న యుద్ధం అద్భుతంగా ఉందని.. ఇంట్లో ఉండటమే దాన్ని అరికట్టడానికి ప్రధాన ఆయుధం అని చెప్పాడు అక్షయ్. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తన వంతుగా 25 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపాడు ఈయన. ఇప్పటి వరకు ఇండియాలో ఇంత భారీ మొత్తాన్ని విరాళంగా అందించిన సూపర్ స్టార్ మరొకరు లేరు. ఈయన సాయాన్ని చూసి అంతా షాక్ అవుతున్నారు. 

కరోనా వైరస్ మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈయన ప్రశంసించడమే కాకుండా.. 25 కోట్ల రూపాయలను తన వంతుగా ప్రభుత్వానికి ఇస్తున్నట్లు ప్రకటించాడు అక్షయ్ కుమార్. ఈయన సాయం చూసి అంతా నువ్వు రియల్ హీరో అంటూ పొగిడేస్తున్నారు. ఇది మన మనుషులు ప్రాణాలకు సంబంధించిన సమయం.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. నా వంతుగా 25 కోట్లు విరాళంగా అందిస్తున్నానంటూ ట్వీట్ చేసాడు ఖిలాడీ. అందరూ హ్యాపీగా ఉండాలని దేవున్ని కోరుకుంటున్నట్లు చెప్పాడు ఈయన. బాలీవుడ్ హీరోలలో ఇప్పటి వరకు అక్షయ్ కుమార్ ఒక్కడే విరాళం అందించాడు. మరి ఈయన స్పూర్థితో ఇంకా ఎంతమంది వస్తారో చూడాలిక. 


 

More Related Stories