English   

విక్ర‌మ్ మ‌ళ్లీ బాలీవుడ్ వెళ్తున్నాడుగా..

Akshay-Kumar

విక్ర‌మ్ అంటే హీరో విక్ర‌మ్ కాదు.. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్.. విక్ర‌మ్ కే కుమార్. ఈ మ‌ధ్యే హ‌లో లాంటి క్లాస్ సినిమాను అందించిన ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు మ‌ళ్లీ బాలీవుడ్ కు వెళ్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈయ‌న కోసం బాలీవుడ్ హీరోలు కూడా వేచి చూస్తున్నారు. అద్భుత‌మైన టెక్నీషియ‌న్ కావ‌డంతో విక్ర‌మ్ తో వ‌ర్క్ చేయ‌డానికి హీరోలు ఎప్పుడూ ఆస‌క్తి చూపిస్తూనే ఉంటారు. హిట్టు ఫ్లాపులు ప‌క్క‌న‌బెట్టి విక్ర‌మ్ తో ప‌ని చేయ‌డానికి సై అంటున్నారు హీరోలు. మొన్నొచ్చిన హ‌లో.. దానికి ముందు వ‌చ్చిన 24 కూడా క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాపులే. కానీ మంచి సినిమాలు. అందుకే విక్ర‌మ్ కే కుమార్ పై ఇంకా న‌మ్మ‌కం త‌గ్గ‌లేదు హీరోల‌కు. ఇప్పుడు ఈయ‌న త‌ర్వాతి సినిమా ఏంట‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అక్కినేని కంపౌండ్ లోనే మ‌రో సినిమా చేయ‌బోతున్నాడంటూ ఆ మ‌ధ్య నాగార్జున అనౌన్స్ చేసాడు. నాగ‌చైత‌న్య కోసం ఈయ‌న క‌థ సిద్ధం చేస్తున్నాడు. కానీ అంత‌లోనే నానితో కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది.

ఇక ఇప్పుడు బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు విక్ర‌మ్. ఇప్ప‌టికే ఈయ‌న అక్ష‌య్ కుమార్ కు క‌థ కూడా చెప్పేసాడు. అస‌లే సౌత్ ద‌ర్శ‌కులు అంటే అక్ష‌య్ కుమార్ కు ఎన‌లేని అభిమానం. ప్ర‌భుదేవా.. క్రిష్.. ప్రియ‌ద‌ర్శ‌న్ లాంటి ద‌ర్శ‌కుల‌ను చాలా న‌మ్ముతాడు ఈ హీరో. ఇప్పుడు విక్ర‌మ్ చెప్పిన క‌థ కూడా న‌చ్చ‌డంతో ఆయ‌నతో సినిమా చేయ‌డానికి అక్ష‌య్ ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ని తెలుస్తుంది. మ‌రోవైపు ఈ ద‌ర్శ‌కుడు త‌మిళ్ లో కార్తి హీరోగా ఓ సినిమాకు క‌మిట‌య్యాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఇక్క‌డ తెలుగులోనూ రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నాడు మ‌రి వీటిని కాద‌ని ఇప్పుడు విక్ర‌మ్ ఏం చేస్తాడు.. బాలీవుడ్ లో ఎలా చేస్తాడు అనేది చూడాలిక‌..! 

More Related Stories