English   

ఫోర్బ్స్‌ జాబితాలో ఏకైక ఇండియన్ హీరో అక్షయ్

Akshay Kumar
2020-06-06 09:34:17

కరోనా విపత్తు సమయాన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వానికి, సినిమా కార్మికులకి బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ 25 కోట్ల విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే. ఆయన ఔదార్యం ఊరికే పోలేదు. ఆయన ఈ ఏడాది మొత్తంలో ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక ఇండియన్ హీరోగా నిలిచారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సంపాదిస్తున్న మొదటి వంద మంది సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏకైక  బాలీవుడ్‌ సెలబ్రిటీగా అక్షయ్‌ కుమార్ స్థానం సంపాదించారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ఈ ఈ జాబితాలో 52 ఏళ్ల అక్షయ్‌ స్థానం కూడా ఆయన వయసుకు తగ్గట్టే 52 ఉండటం గమనార్హం.

ఇక 590 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల సంపాదనతో అమెరికన్‌ మోడల్‌ కైలీ జెన్నర్‌ ఫోర్బ్స్‌ జాబితాలో ప్రధమ స్థానంలో నిలవగా పాప్ గాయకుడు, నటి కర్దాషియన్‌ భర్త కేన్‌ వెస్ట్‌ 170 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లతో రెండవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. జూన్‌ 2019 నుంచి జూన్‌ 2020 మధ్యకాలంలో అక్షయ్ సంపాదన 48.5 మిలియన్లు అని ఫోర్బ్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అక్షయ్ నటించి విడుదలకు సిద్ధమైన చిత్రాలు 'బచ్చన్‌పాండే', 'బెల్‌బాటమ్‌'ల ద్వారా మరో 13 మిలియన్‌ డాలర్లు అక్షరు రాబట్టగలడని ఫోర్బ్స్‌ అంచనా. అంతే కాక కోవిడ్‌ రిలీఫ్ కోసం భారీగా విరాళమిచ్చిన అక్షరుని భారతదేశంలోనే గొప్ప దాత అని ప్రశంసించింది. అలాగే హాలీవుడ్‌ నటులు విల్‌ స్మిత్‌, ఏంజలీనా జోలీలనే కాకుండా రిహానా, లేడీ గాగా, కేటీ పెర్రీ, జెన్నిఫర్‌ లోపెజ్‌ వంటి పాప్‌ స్టార్ల కంటే అక్షయ్‌ ముందంజలో నిలవడం విశేషం.

More Related Stories