English   

కొత్త ఇంట్లోకి బన్నీ...ఈరోజు నుండే 

Ala vaikunta puram lo
2019-08-22 09:42:03

అల్లు అర్జున్‌ కొత్త ఇంటి పనులు పూర్తయ్యాయి. అదేంటి అల్లు అర్జున్ కొత్త ఇల్లు కట్టుకుంటున్నారా అని ఆశ్చర్యపోకండి, అది సినిమా ఇల్లు. త్రివిక్రమ్‌ డైరెక్షన్ లో అల్లు అర్జున్‌ హీరోగా 'అల.. వైకుంఠపురములో...' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే భారీ ఇంటి సెట్‌ వేస్తున్నారు. కాస్త గ్యాప్ తీసుకున్న సినిమా యూనిట్ నేటి నుండి షూటింగ్ మొదలు పెట్టనున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ హౌస్ సెట్ లో ఈ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. సినిమా టైటిల్‌ లోగోలో ఓ పెద్ద భవనం కనిపిస్తున్న సంగతి అందరూ గమనించే ఉంటారు. ఈ సినిమాకి సంబందించిన కీలక సన్నివేశాలన్నీ ఈ ఇంటి సెట్‌లో తీస్తారట. ఈ ఇంటిని ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్‌ ప్రకాశ్‌ డిజైన్‌ చేశారట. 

దాని నిర్మాణానికి 5 కోట్ల దాకా ఖర్చు పెట్టారట. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. పల్లెటూరి కుర్రాడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఈ రెండు పాత్రల్లో బన్నీ కనిపిస్తాడనేది టాక్. సాఫ్ట్‌వేర్ కుర్రాడు లవ్‌ ట్రాక్‌లో పూజాహెగ్దె కనిపిస్తుందట. శ్రీమంతుల బిడ్డగా అలకనంద పాత్రలో కనిపించనున్న పూజాహెగ్దే ఇల్లే ఇదని అంటున్నారు. టబు, జై రామ్ లు పూజా అమ్మానాన్నలుగా నటించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్, నవదీప్, సుశాంత్ లు కీలక పాత్రలు పోషిష్టున్నారు.ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

More Related Stories