English   

అల వైకుంఠపురములో 10 డేస్ కలెక్షన్స్.. రంగస్థలం ఔట్..

Ala Vaikunthapurramuloo
2020-01-22 13:05:13

10 రోజుల తర్వాత కూడా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో జోరు మామూలుగా లేదు. నైజాంలో అయితే 35 కోట్ల షేర్ దాటేసి 40 కోట్ల వైపుగా పరుగులు తీస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 112 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి 120 కోట్లకు పైగా కలెక్ట్ చేయడానికి దూసుకుపోతుంది అల వైకుంఠపురములో. మళయాలంలో కూడా ఈ చిత్రం రప్ఫాడిస్తుంది.

 ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లోనే 143 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో కూడా 3 మిలియన్ క్లబ్బులో చేరిపోయిన ఈ చిత్రం షేర్ 13 కోట్ల వరకు వసూలు చేసింది. కర్ణాటకలో 10 కోట్ల మార్క్ దాటేసింది. తమిళనాట కూడా 2 కోట్లకు పైగానే షేర్ తీసుకొచ్చింది. మళయాలంలో 2 కోట్ల వరకు వసూలు చేసింది అల వైకుంఠపురములో. 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అల వైకుంఠపురములో తొలివారంలోనే బయ్యర్స్ అందర్నీ సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లింది. ఇప్పటికే అంతా లాభాల్లోకి వచ్చేసారు.. రెండోవారం కూడా కుమ్మేసింది ఈ చిత్రం. 

పైగా ఇప్పుడు రవితేజ డిస్కో రాజా ఉన్నా కూడా అల వైకుంఠపురములో ధాటికి తట్టుకుని నిలబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధిస్తుంది. అయితే ఇన్నేసి కోట్లు నిజంగానే వస్తున్నాయా లేదా అనేది మాత్రం ప్రేక్షకుల్లో అనుమానాలు అలాగే ఉండిపోతున్నాయి. మొత్తానికి చూడాలిక.. బన్నీ జోరు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో..?

More Related Stories