English   

అల వైకుంఠపురములో మరో రికార్డు...ఆరోజు నుండి డిజిటల్ లో

Ala Vaikunthapurramuloo
2020-02-22 11:00:57

అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. సినిమా విడుదలకు ముందే పాటలు సూపర్‌హిట్‌ అయ్యి అందర్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని పాటలు జియో సావన్‌లో 100 మిలియన్‌ మార్కుని దాటినట్లు ఆ యాప్‌ నిర్వాహకులు ప్రకటించారు. అంతే కాకుండా ఈ రికార్డును సాధించిన మొట్టమొదటి సౌత్‌ ఇండియన్‌ ఆల్బమ్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులు అన్నీ బద్దలు కొట్టింది. 

అయితే ఈ సినిమా డిజిటల్ లో ప్రింట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో గుడ్ న్యూస్ చెప్పారు దర్శక నిర్మాతలు. నిజానికి ఈ సినిమాని సన్ నెక్ట్స్ భారీ రేట్ ఇచ్చి మరీ అల వైకుంఠపురములో డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి ప్లాట్ ఫామ్స్ కాదని ఈ సినిమాను సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. 

అయితే ఈ సినిమా విడుదల సమయంలో అగ్రిమెంట్ 50 రోజులకు కుదుర్చుకున్నారు దర్శక నిర్మాతలు. అందుకే జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా కోసం చాలా మంది అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. నాలుగు వారాల పాటు కలెక్షన్ల పంట పండించిన అల వైకుంఠపురములో ఐదో వారంలో కూడా కొన్ని చోట్ల షేర్స్ తీసుకొచ్చింది. ఇక డిజిటల్ లో ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి మరి.

More Related Stories