English   

సడక్ 2 ట్రైలర్ అత్యంత చెత్త వీడియోగా రికార్డుల మీద రికార్డులు

Alia Bhatts Sadak 2
2020-08-14 14:09:05

బాలీవుడ్ కు సుశాంత్ మరణం ఎఫెక్ట్ ఇంకా వదలలేదు. సుశాంత్ మరణానికి బాలీవుడ్ లో ఉన్న నెపోటిజమే కారణం అని అందరూ నమ్ముతున్నారు. కొందరు అయితే రియా కారణంగానే చనిపోయాడు అని అంటున్నారు. ఆ విషయాలను దర్యాప్తు చేయడానికే ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగింది. అయితే ఫ్యాన్స్ మాత్రం తమ కోపాన్ని బాలీవుడ్ పెద్దల మీద చూపిస్తూనే ఉన్నారు. విషయానికి వస్తే బాలీవుడ్ సినిమాలని థియేటర్స్ అందుబాటులో లేని కారణంగా ఓటీటీలకి అమ్మేస్తున్నారు, ఇప్పటికే సుశాంత్ నటించిన చివరి సినిమా దిల్ బేచారా, శ్రీ దేవి కూతురు నటించిన గుంజన్ సక్సేన బయోపిక్ కూడా అలానే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అలానే మరో సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. అదే “సడక్ 2”, ఈ సినిమాని కూడా హాట్ స్టార్ లో విదుదల చేయనున్నారు. 

సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, ఆలియా భట్, పూజా భట్ లాంటి అగ్ర తారలు నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని తాజగా యూట్యూబ్ లో విడుదల చేశారు. అయితే అసలు ఆ వీడియోలో కంటెంట్ ఏముంది అనేది కూడా చూడకుండా దానికి డిస్ లైక్స్ కొట్టేస్తున్నారు జనం. ఈ . దీనంతటికీ ప్రధాన కారణం ఈ చిత్ర దర్శకుడు మహేష్ భట్ అని అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమాలో గతంలో సుశాంత్ ని విమర్శించిన ఆలియా భట్ కూడా కనిపిస్తుండటంతో సుశాంత్ అభిమానులు సహా సానుభూతిపరులు అందరూ కలిసి భారీ స్థాయిలో డిస్ లైకులు కొట్టారు.

అది కాస్తా ఏ స్థాయికి వెళ్ళింది అంటే మొత్తం యూట్యూబ్ చరిత్రలోనే అత్యధిక డిస్ లైక్స్ వచ్చిన వీడియోగా ఆరవ స్థానానికి చేరింది. ఇక మన దేశానికి సంబంధించి అయితే ఇది ఇప్పుడు టాప్ స్థానంలో ఉంది. మూడు కోట్ల మంది ఈ వీడియోను వీక్షించగా 81 LAKHs మంది డిస్ లైక్స్ కొట్టారు. దీంతో వరస్ట్ రికార్డును అందుకున్న ఈ వీడియో వరల్డ్ లోనే టాప్ కి వెళ్తుందేమో చూడాలి.

More Related Stories