English   

RRRలో అలియా బట్ రెమ్యూనేషన్ తెలిస్తే షాక్ అవుతారు

 Alia Bhatt
2020-04-09 16:31:15

ఆర్ఆర్ఆర్ లో చరణ్ సరసన అలియా బట్ నటిస్తోందని కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే భీం ఫర్ రామరాజు వీడియోతో అలియా సినిమాలో నటిస్తుందని క్లారిటీ వచ్చేసింది. ఎలా అంటే ఆ భామ చరణ్ వీడియో ని షేర్ చేసి అందరికీ క్లారిటీ ఇచ్చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి ముందు నుండి  ఈ సినిమా కోసం ఎక్కడ తగ్గట్లేదు. సినిమా కోసం హాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ను తీసుకున్నారు. ఎందుకంటే రాజమౌళి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ అలాంటిది మరి. బాహుబలితో ఆయన సినిమాలో చిన్న పాత్ర దొరికిన చాలు అనే అంత క్రేజ్ సంపాదించారు. కాగా ఆయన బ్రాండ్ ఇమేజ్ కి అతని డైరెక్షన్ పై ఉన్న నమ్మకానికి ప్రొడ్యూసర్ లు కూడా ఎక్కడా కంప్రమైస్ అవ్వకుండా ఖర్చుపెట్టేస్తారు.కాగా ఈ సినిమాకు హీరోలకు భారీగా రెమ్యూనేషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే అందాల తార అలియా బట్ కి కూడా పెద్ద మొత్తం లో రెమ్యూనేషన్ ఇస్తున్నారట. ఎంతంటే తెలుగులోనే ఇప్పటివరకు అంత ఇవ్వడం మొదటిసారి. ఆలియా ఒక్కరోజు షూటింగ్ కి ఏకంగా 50లక్షలు పుచ్చుకుంటుంది. కాగా అలియా మొత్తం 10రోజులు షూటింగ్ లో పాల్గొంటుందట. దాంతో ఆమె ఈ సినిమాకోసం మొత్తం 5కోట్ల వరకు పుచ్చుకుంటుంది. అలియా తో పాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో నటిస్తుండగా ఆయనకు కూడా భారీగానే ముట్ట చెబుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. 

More Related Stories