English   

నాంది టీజర్.. అల్లరి నరేష్ ను మరో కోణం..

Naandhi Teaser
2020-07-01 14:35:33

నాంది సినిమా టీజర్ చూసిన తర్వాత అబిమానులు కూడా ఇదే అంటున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా కామెడీ పాత్రలే చేసాడు కాబట్టి కేరాఫ్ కామెడీ అయిపోయాడు నరేష్. ఒక విధంగా చెప్పాలంటే తెలుగులో రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ సినిమాలకు అంత మార్కెట్ తీసుకువచ్చిన హీరో అల్లరి నరేష్ మాత్రమే. అయితే కొన్ని ఏళ్లుగా  ఈయన సినిమాలు విజయం సాధించడం లేదు. అందుకే ఇప్పుడు తనలో ఉన్న నటుడికి పని చెబుతున్నాడు. హిట్ కోసం కొత్తదనం వైపు పరుగులు తీస్తున్నాడు. ఈయన నటిస్తున్న కొత్త సినిమా నాంది. జూన్ 30న  నరేష్ పుట్టిన రోజు కానుకగా విడుదలైన నాంది టీజర్  సంచలనం సృష్టిస్తోంది. ప్రాణం, గమ్యం తరహాలో పూర్తిగా కొత్త తరహా సినిమా ఇది.న్యాయం కోసం ఒక ఖైదీ చేసే పోరాటం ఈ సినిమా.

అల్లరి నరేష్ నటిస్తున్న 57వ సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఇఫ్పుడు టీజర్ విడుదల చేసారు. అందులో కూడా నగ్నంగానే ఉన్నాడు నరేష్. ఇందులో నరేష్ గెటప్ చూసి అంతా షాక్ అవుతున్నారు. మహర్షి సినిమాలో సీరియస్ పాత్రలో మెప్పించిన ఈయన.. ఇప్పుడు కొత్త దర్శకుడు విజయ్ కనకమేడలతో కలిసి ప్రయోగం చేస్తున్నాడు. దీనికి దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాత కావడం విశేషం. మొదటి పోస్టర్ లో నగ్నంగా పోలీస్ స్టేషన్ లో తలకిందులుగా వేలాడదీసి ఉన్న నరేష్ లుక్ చూసి అంతా ఫిదా అయిపోయారు. మొన్న కూర్చున్న పోస్టర్ విడుదల చేసారు. కొత్తదనం కోసం నరేష్ ప్రయత్నించడం నిజంగానే మెచ్చుకోదగిన విశేషం. ఇది విజయం సాధిస్తే కచ్చితంగా నరేష్‌లోని మరో కోణం బయటికి వస్తుంది. 

More Related Stories