English   

అల్లరి నరేష్ నాంది ఓటీటీ రిలీజ్..

Allari Naresh Naandhi
2021-01-27 14:46:38

టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న  థ్రిల్లర్ మూవీ నాంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఫుల్ రైట్స్‏ను జీ స్టూడియో తీసుకున్నట్లుగా సమాచారం. ఇక నాంది మూవీ థియేట్రికల్ శాటిలైట్ రైట్స్‏తోపాటు డిజిటల్ హక్కులను కూడా జీ సంస్థ సొంతం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మొత్తం రూ.8.5 కోట్లకు ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరన్ పకాల సంగీతం అందించారు. అల్లరి నరేష్  సంక్రాంతి మూవీ ‘బంగారు బుల్లోడు’  ప్రేక్షకులను నిరాశపరిచింది. దీంతో.. రాబోయే మూవీ ‘నాంది’పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. 
 

More Related Stories