English   

మ‌హేశ్ ను అలా వాడేసావేంటి నరేషా..?

Allari-Naresh

తాత తండ్రి మ‌న‌వ‌ళ్ళ సొత్తు.. అలాగే తండ్రుల్ని కూడా వార‌సులు వాడేసుకుంటారు. ఇది ఇండ‌స్ట్రీలో అయితే ఇంకా ఎక్కువ‌గానే ఉంటుంది. తాత‌ల‌.. తండ్రుల పాట‌లు రీమిక్స్ చేస్తుంటారు. వాళ్ల టైటిల్స్ వాడేసుకుంటారు. కానీ వార‌సత్వంతో ప‌నిలేకుండా అంద‌రి టైటిల్స్.. పాట‌ల‌ను వాడే ఏకైకహీరో  అల్ల‌రి న‌రేష్. ఈయ‌న ఏం చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఎందుకంటే ఏ ఇమేజ్ లేని కామెడీ హీరో కాబ‌ట్టి. ఇదే అల్ల‌రోడి బ‌లం. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు న‌రేష్. అస‌లే హిట్ కోసం మొహం వాచిపోయి ఉన్న అల్ల‌రోడు.. మ‌హేశ్ బాబును వాడుకుంటున్నాడు. ఈయ‌న న‌టించిన భ‌ర‌త్ అనే నేనులోని వ‌చ్చాడ‌య్యో సామి సాంగ్ ఎంత పెద్ద హిట్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఈ పాట‌లోని ప‌ల్ల‌విని త‌న సినిమా టైటిల్గా వాడేసుకుంటున్నాడు న‌రేష్. భీమినేనితో చేస్తోన్న సినిమాకు సిల్లీఫెల్లోస్ అనే టైటిల్ అనుకున్నా ఇప్పుడు కాద‌ని వ‌చ్చాడ‌య్యో సామీ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇదే క‌న్ఫ‌ర్మ్ అయ్యేలా కూడా క‌నిపిస్తుంది. న‌రేష్ ఇలా పాపుల‌ర్ ప‌దాల‌ను టైటిల్స్ గా వాడ‌టం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ విక్ర‌మార్కుడు హిట్టైన త‌ర్వాత అత్తిలి స‌త్తిబాబును.. మ‌ల్లీశ్వ‌రిలోని పెళ్లి కాని ప్రసాద్ ను.. క‌త్తి కాంతారావును వాడేసాడు. ఇప్పుడు మ‌ళ్లీ మ‌హేశ్ ని వాడుకుంటున్నాడు. మ‌రి ఈ వ‌చ్చాడ‌య్యో సామితో అయినా న‌రేష్ హిట్ వ‌స్తుందేమో చూడాలిక‌..!
 

More Related Stories