English   

నాంది 5 రోజుల కలెక్షన్స్

Allari Naresh
2021-02-25 10:08:35

కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న హీరో అల్లరి నరేష్. బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ తో "సుడిగాడు" సినిమా తరవాత నరేష్ కు సరైన హిట్ రాలేదు. దాంతో ఇప్పటివరకు హిట్ లేఖ 9ఏళ్ళు గడిచింది. 2021 ప్రారంభం లో "బంగారు బుల్లోడు" సినిమాతో రాగా ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టి నిరాశపరిచింది. వెంటనే ఫిబ్రవరి 19 "నాంది" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థ్రిల్లర్ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా చూస్తే మొదట్లో డల్ గానే ఉన్నాయి. అయితే మెల్లిమెల్లిగా కొంచెం పికప్ అందుకున్నాయి. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా మొత్తం 2.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 3.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఐదురోజులు పూర్తయ్యేరసరికి సినిమా 3.7 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 0.13 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈరోజు దాదాపు ఆ టార్గెట్ ను పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Related Stories