English   

సాహో వాయిదా...అరవింద్ చెప్పింది అదేనా ?

aravind
2019-07-17 19:54:40

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే ? అది సాహో సినిమా వాయిదా పడడమే. సినిమా షూటింగ్ పూర్తి అయినా వీఎఫ్ఎక్స్ బాకీ ఉండడంతో ఆ సినిమా వాయిదా పడడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే రెండు సినిమాలు అదే రోజున వస్తున్నామని ప్రకటించడంతో అది సగం ఖరారు అయినట్టే. దానికి తోడు ఈరోజు తెలుగు టాప్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ మరింత క్లారిటీ ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ వేదికగా `గుణ 369` ట్రైలర్ లాంచ్ వేడుకలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఓ మాట అన్నారు. ఓ పెద్ద సినిమా వాయిదా పడడంతో ఇతరులంతా ఆ డేట్ లాక్ చేసుకున్నారని అర్ధం అయ్యీ అవ్వనట్టు చెప్పారు. సాహో అని ఆయన పేరు మేన్షన్ చేయక పోయినా అది సావు అనే విషయం అర్ధం అయిపోతోంది. దీంతో ఇప్పటివరకూ ప్రభాస్ సాహో` రిలీజ్ వాయిదా ఉందా లేదా అనే విషయాన్ని ఈయన ఖరారు చేసినట్టయ్యింది.  

 

More Related Stories