English   

 అల్లు అర‌వింద్ మాట‌ల‌కు అర్థం అదేనా..?

allu-arvind

నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక‌లో కావాల‌నే కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేసాడు అల్లు అర‌వింద్. ఆ రోజు త‌న కొడుకు సినిమా గురించి మాట్లాడుతూ.. రేపు ఈ చిత్రం విడుద‌లైన త‌ర్వాత క‌చ్చితంగా ఓ వ‌ర్గం మీడియా దీన్ని కావాల‌నే నెగిటివ్ ప్ర‌చారం చేస్తార‌ని చెప్పాడు అల్లు అర‌వింద్. కానీ నిజానికి మంచి సినిమా చేసిన‌పుడు కావాల‌ని ఏ మీడియా కూడా తొక్కేయాల‌ని చూడ‌దు.. ఏదో ప‌ర్స‌న‌ల్ గా ప‌గ‌లుంటే త‌ప్ప‌. కానీ అంత‌గా ఉన్నా కూడా బాగున్న సినిమాను బాలేద‌ని చెబితే న‌మ్మ‌డానికి ప్రేక్ష‌కులు ఏం పిచ్చోళ్లు కాదు.. అలా కాకుండా సినిమా తేడాగా ఉన్న‌పుడు బాగుంది అని ప్ర‌చారం చేయ‌డం కూడా జ‌ర‌గ‌ని ప‌ని. అలా చేసినా కూడా ప్రేక్ష‌కులు చూడ‌రు. ఈ చిన్న విషయం అల్లు అర‌వింద్ కు అర్థం కాకుండా అయితే ఉండ‌దు. అది తెలిసే నా పేరు సూర్య గురించి క‌మెంట్స్ చేసాడు ఈ నిర్మాత‌. సినిమా విడుద‌లైన త‌ర్వాత క‌చ్చింత‌గా నెగిటివ్ ప్ర‌చారం చేస్తారు చూడండి అంటూ ముందే ప్రేక్ష‌కుల్ని సిద్ధం చేసాడు. ఇప్పుడు నిజంగానే సినిమాకు టాక్ తేడాగా వ‌చ్చేసింది. దాంతో ప్రేక్ష‌కులు కూడా క‌న్ఫ్యూజ‌న్ లో ప‌డిపోయారు. నిజంగానే సినిమా బాలేదా.. లేదంటే కావాల‌నే చేస్తున్నారా అని. దీనికి స‌మాధానం ఒక్క‌టే చూసిన వాళ్ల‌ను అడ‌గడం లేదంటే చూసేయ‌డం. ఏదేమైనా అల్లు అర‌వింద్ మాత్రం చాలా తెలివిగా త‌ప్పించుకున్నాడు.

More Related Stories