English   

అర‌వింద్ గారూ.. అప్పుడు మీ మెగా ఫ్యామిలీ ఎటుపోయింది...?

Allu-Aravind
2018-04-25 16:40:32

ఈ ప్ర‌శ్న  అల్లు అర‌వింద్ ను అడ‌గాలంటే సీనియ‌ర్స్ కూడా భ‌య‌ప‌డ‌తారు. కానీ ఓ జూనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అడిగేసింది. య‌స్.. అడిగింది లేడీ ప్రొడ్యూస‌రే. త‌ను అక్కినేని ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. అయితేనేం నిజాన్ని నిర్భ‌యంగా అడ‌గ‌ట‌మే కాదు.. అర‌వింద్ ప్ర‌పోజ‌ల్ ను క‌డిగేసింది కూడా. ఇంత‌కీ ఆ ప్రొడ్యూస‌ర్ ఎవ‌రో తెలుసా... సుప్రియ‌. లేటెస్ట్ గా ఫిల్మ్ చాంబ‌ర్ వ‌ద్ద ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన హ‌డావిడీ.. ఆ త‌ర్వాత మెగా ఫ్యామిలీలోని స్టార్ హీరోలంతా వ‌చ్చిన చేసిన హ‌డావిడీ అంద‌రికీ తెలుసు. శ్రీ రెడ్డి త‌మ త‌ల్లిని ఏదో అంద‌ని.. వాళ్లు ఇంకేదో అర్థం చేసుకుని.. ప‌న్లో ప‌నిగా మీడియానూ టార్గెట్ చేసి ఏకంగా ఓ మూడు నాలుగు చానల్స్ ను బ‌హిష్క‌రించాల‌ని బ‌హిరంగంగా పిలుపునిచ్చింది మెగా ఫ్యామిలీ. ఇందుకోసం ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో క‌లిపి ఓ మీటింగ్ ఏర్పాటు చేసింది.అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగిన ఈ ఫంక్ష‌న్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం రాలేదు. వ‌చ్చిన అల్లు అర‌వింద్ మాత్రం ఆ మూడు ఛాన‌ల్స్ ను బ‌హిష్క‌రించాలి.. వారికి ఎలాంటి కంటెంట్ ఇవ్వ‌కూడ‌దు. ఇంట‌ర్వ్యూస్ కూడా ఇవ్వొద్దు అని ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కు చెప్పాడ‌ట‌. కొంద‌రు చాన‌ల్స్ ను బ‌హిష్‌క‌రించ‌డం అసాధ్యం అని మొహాన్నే చెప్పేస్తే మ‌రికొంద‌రు.. చూద్దాం అన్నారు. దీంతో త‌న మాట‌కు తిరుగుండ‌దు అనుకున్న అర‌వింద్ ఖంగు తిన్నాడు.అయితే ఖంగును మించిన షాక్ సుప్రియ ఇచ్చింది అర‌వింద్ కు.

సుప్రియ, అల్లు అర‌వింద్ ను డైరెక్ట్ గా కొన్ని ప్ర‌శ్న‌లు వేసింద‌ట‌. రీసెంట్ గా ఓ మీడియా యాంక‌ర్ ఇండ‌స్ట్రీలో లం.. ముండ‌లులేరా అంటే మేం వెంట‌నే స్పందించి.. ఓ మీటింగ్ ఏర్పాటు చేసి ఖండించాం. కానీ అప్పుడు మీరు కానీ, మీ ఫ్యామిలీ కానీ ఎందుకు రాలేదు. అప్పుడు ఈ ప‌వ‌న్ క‌ళ్యాణ్ః, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ ఎక్క‌డున్నారు. ఇప్పుడు మీ ప‌ర్స‌న‌ల్ వ్య‌వ‌హారానికి మేమంతా ఎందుకు స‌హ‌క‌రించాల‌ని క‌డిగేసింద‌ట‌. ఇది ఎక్స్ పెక్ట్ చేయ‌ని అల్లు అర‌వింద్ షాక్ అయిపోయాడ‌ని చెబుతున్నారు. నిజానికి త‌ను అడిగిన‌వ‌న్నీ నిజ‌మే క‌దా. ఈ విష‌యంలో మీటింగ్ లో  కూర్చున్న పెద్ద‌లు కూడా సుప్రియ‌ను స‌పోర్ట్ చేశార‌ని టాక్. చాలా ర‌హ‌స్యంగా అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిపిన ఈ మీటింగ్ లోని కొన్ని ఇంపార్టెంట్ విష‌యాలు ఇలా ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అయినా ఇండ‌స్ట్రీ అంటే మెగా ఫ్యామిలీ ఒక్క‌టేనా.. ఇండ‌స్ట్రీని అడ్డుపెట్టుకుని రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తున్నారా అని అర‌వింద్ ను మ‌రికొంద‌రు అడిగార‌ని వినిపిస్తోంది. మొత్తంగా నా మాటే శాస‌నం అని ఇన్నాళ్లుగా ఫీల‌వుతోన్న అర‌వింద్ కు సుప్రియ షాక్ ఇస్తే.. ఆమెను స‌పోర్ట్ చేస్తూ చాలామంది మాట్లాడి అర‌వింద్ కు చెమ‌ట‌లు ప‌ట్టించార‌ట‌. ఏదేమైనా ఇండ‌వ‌డ‌స్ట్రీ ఎవ‌రి సొత్తూకాదు. ఒక్క‌రు శాసిస్తే అంద‌రూ పాటించ‌డానికి. మ‌రి దీనిపై అల్లు అర‌వింద్ ఏం మాట్లాడాడు.. అనే ప్ర‌శ్నే లేదు. ఎందుకంటే ఏం మాట్లాడ్దానికీ ఆయ‌న దగ్గ‌ర ఆన్స‌ర్ లేదు క‌దా..

More Related Stories