English   

అల్లు అర్జున్ ను భయపెడుతున్నాడా..?

Allu-arjun
2018-11-13 19:46:08

తెలుగు సినిమా పరిశ్రమలో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన హీరో ఎవరు..? ఓ హీరో ఎంత స్టైలిష్ గా కనిపించాలో అంత స్టైలిష్ గా కనిపించిన మొదటి హీరో ఎవరు..? ఈ ప్రశ్నలకు సెకండ్ థాట్ లేకుండా వినిపించే పేరు అల్లు అర్జున్.. యస్ అందుకే బన్నీ స్టైలిష్ స్టార్ అయ్యాడు. మెగా కాంపౌండ్ కు సంబంధించి బిరుదులు లేకుండా తనే స్వయంగా సాధించిన క్రెడిట్ ఇది. అయితే ప్రస్తుతం ఈ స్టైలిష్ స్టార్ కు మరో సడెన్ స్టార్ షాక్ ల మీద షాకులు ఇస్తున్నాడు. వైవిధ్యమైన వస్త్రధారణతో ప్రతి పబ్లిక్ ఫంక్షన్ కు అటెండ్ అవుతూ.. అందరి అటెన్షన్ తనపైనే ఉండేలా చేసుకుంటున్నాడు. అతనే విజయ్ దేవరకొండ. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచే నయా స్టార్ గా అవతరించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు మాగ్జిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ను తనవైపు తిప్పుకుంటున్నాడు. ఒకప్పుడు ఇలా అల్లు అర్జున్ చేసేవాడు. అలాంటివాడు కూడా కొన్ని ఫంక్షన్స్ లో విజయ్ వైపు తేరిపార చూస్తున్నాడు. అతని స్టైలింగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఇది స్టైలింగ్ వరకూ అయితే ఫర్వాలేదు కానీ.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం బన్నీ ప్లేస్ ను కూడా ఆక్రమించేలా ఉన్నాడు. బన్నీ కంటే అందగాడు. మంచి నటుడు... ఏ పాత్రలోకైనా ఒదిగిపోగల ప్రతిభావంతుడు.. అన్నిటికంటే  బ్యాక్ గ్రౌండ్ లేనివాడు. ఇవన్నీ అతనిపై సాఫ్ట్ కార్నర్ పెంచాయి. మరోవైపు మొన్నటి వరకూ టాప్ సిక్స్ లో  ఉన్న బన్నీ ఆ రేస్ నుంచి ఇంకా వెనకబడ్డాడు. ప్రస్తుతం వరుస విజయాలతో విజయ్ దేవరకొండ బన్నీ ప్లేస్ కు ఎర్త్ పెట్టేలా ఉన్నాడంటున్నారు విశ్లేషకులు. అయితే ఇలాంటి నటులను అంత ఈజీగా ఎదగనివ్వదు పరిశ్రమ. వరుస విజయాలతో పాటు ప్రతి సినిమాతోనూ ఫ్యాన్ బేస్ పెంచుకుంటే తప్ప ఇప్పుడు విజయ్ వంటి బ్యాక్ గ్రౌండ్ లేని నటులు నిలబడటం అసాధ్యం. మరి విజయ్ దీన్ని సాధ్యం చేసేలానే కనిపిస్తున్నాడు. కాకపోతే కాస్త యాటిట్యూడ్ తగ్గించుకుంటే ఇంకా ఎక్కువ నంబర్ ఆడియన్ కు దగ్గరవుతాడు..

More Related Stories