English   

బ‌ర్త్ డే ట్రీట్ ఇస్తున్న బ‌న్నీ..

allu-arjun
2018-04-05 17:16:51

ఈ రోజుల్లో హీరోల పుట్టిన‌రోజుల‌కు క‌నీసం త‌మ సినిమాల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ అయినా విడుద‌ల చేయ‌డం అల‌వాటుగా మారింది. ఇప్పుడు బ‌న్నీ కూడా ఇదే చేస్తున్నాడు. ఎప్రిల్ 8న ఈయ‌న పుట్టిన‌రోజు. దాంతో కొత్త సినిమా నా పేరు సూర్య‌కు సంబంధించిన డైలాగ్ ఇంపాక్ట్ ను విడుద‌ల చేయ‌బోతున్నారు. అంటే ఓ డైలాగ్ టీజ‌ర్ అన్న‌మాట‌. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్స్ కు ఇంపాక్ట్ అని పేరు పెట్టాడు ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ ఇంపాక్ట్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. దానికి తోడు వ‌చ్చిన రెండు పాట‌లు కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి. దాంతో ఇప్పుడు డైలాగ్ టీజ‌ర్ కూడా అదిరిపోతుంద‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ డైలాగ్ ఇంపాక్ట్ కు సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇందులో బ‌న్నీ లుక్ కూడా చాలా రఫ్ గా ఉంది. చుట్ట పెట్టుకుని పొగ తాగుతూ స్టైలిష్ హెయిర్ స్టైల్ తో ర‌ప్ఫాడిస్తున్నాడు అల్లు వార‌బ్బాయి. అను ఎమ్మాన్యువ‌ల్ హీరోయిన్ గా వ‌స్తోన్న ఈ చిత్రాన్ని నాగ‌బాబు, ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ నిర్మిస్తున్నారు. వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న బ‌న్నీకి గ‌తేడాది డిజే రూపంలో అనుకోని బ్రేక్ పడింది. ఈ చిత్రం భారీ వ‌సూళ్లు సాధించినా.. యావ‌రేజ్ గానే నిలిచింది. దాంతో ఇప్పుడు నా పేరు సూర్య‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని త‌న స‌త్తా ఏంటో చూపించాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు అల్లుఅర్జున్. మ‌రి చూడాలిక‌.. ఈయ‌న డైలాగ్ ఇంపాక్ట్ ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories