English   

మ‌హేశ్ కు పోటీగా వెళ్తోన్న బ‌న్నీ.. 

Allu-Arjun-mahesh
2018-04-10 17:56:53

ఇప్పుడు ఇండ‌స్ట్రీలో పోటీ వాతావ‌ర‌ణం బాగా ఉంది. ఆ హీరో అది చేసాడంట అని వినిపిస్తే చాలు.. మ‌నం ఎందుకు చేయ‌కూడ‌దంటూ మ‌రో హీరో కూడా బ‌య‌ల్దేరుతున్నాడు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఆడియో వేడుక అంటే శిల్ప‌క‌ళావేదిక లేదంటే హోట‌ల్స్ లో లిమిటెడ్ ఫ్యాన్స్ మ‌ధ్య చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇండ‌స్ట్రీ రేంజ్ మారుతుంది అని చెప్పాల‌నుకుంటున్నారో ఏమో కానీ పెద్ద పెద్ద గ్రౌండ్స్ లోనే ఈ వేడుక‌లు జ‌ర‌ప డానికి స‌న్నాహాలు చేస్తున్నారు హీరోలు. ఈ మ‌ధ్యే మ‌హేశ్ బాబు భ‌ర‌త్ అనే నేను బ‌హిరంగ స‌భ ఎల్బీ స్టేడియంలో జ‌రిగింది. ఈ వేడుక ఊహించిన దాని కంటే పెద్ద విజ‌యం సాధించింది. దాంతో ఇప్పుడు అల్లుఅర్జున్ కూడా ఇలాంటి వేడుక ఒక‌టి ప్లాన్ చేస్తున్నాడు. ఈయ‌న న‌టిస్తోన్న నా పేరు సూర్య ఆడియో వేడుక ఎప్రిల్ 18 లేదంటే 19 వ తేదీల్లో జ‌ర‌గ‌బోతుంది. హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలి స్టేడియంలో ఈ వేడుక‌ను ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్, నాగ‌బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అల్లుఅర్జున్ సైనికుడిగా న‌టిస్తున్నాడు. వ‌క్కంతం వంశీ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారాడు. మ‌హేశ్ భ‌ర‌త్ అనే నేను కంటే ఈ వేడుక పెద్ద‌గా చేయాల‌ని ఆలోచిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి చూడాలిక‌.. నిజంగా త‌న వేడుక‌తో మ‌హేశ్ కు బ‌న్నీ స‌వాల్ విసురుతాడో లేదో..? 

More Related Stories