English   

వామ్మో ఆ స్టెప్పులేంటి బ‌న్నీ..? 

Allu-Arjun
2018-05-01 11:22:18

అల్లుఅర్జున్ అంటే ముందుగా గుర్తొచ్చేదే డాన్సులు. అంత‌గా ఫేమస్ ఆయ‌న‌. ఇండియ‌న్ టాప్ 5 డాన్స‌ర్స్ లో ఆయ‌న కూడా ఒక‌డు. అల్లుఅర్జున్ డాన్సుల‌కు అంత క్రేజ్ ఉంది. కానీ డిజేలో ఎందుకో కానీ డాన్సుల జోలికి వెళ్ల‌లేదు బ‌న్నీ. చేసాడు కానీ ఏదో స్లో సింపుల్ స్టెప్స్ తో ప‌ని కానిచ్చాడు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ పాత బ‌న్నీ బ‌య‌టికి వ‌చ్చాడు. నా పేరు సూర్య‌లో మ‌నోడి డాన్సులు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ముఖ్యంగా ల‌వ‌ర్ ఆల్సో.. ఫైట‌ర్ ఆల్సో పాట‌లో టోపీతో బ‌న్నీ చేసిస విన్యాసాలు చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నాయి. అస‌లు అది గ్రాఫిక్సా లేదంటే నిజంగా చేసాడా అంటే ద‌ర్శ‌కుడు నిజంగానే చేసాడు.. రోజూ ప్రాక్టీస్ కూడా చేసాడు అని సాక్ష్యం ఇచ్చాడు. అది నిజ‌మే అయితే క‌న‌క బ‌న్నీ క‌ష్టానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ఆ పాట‌లో మ‌నోడు చేసిన ఫీట్స్ అలా ఉన్నాయి మ‌రి. మ‌రో స్టెప్ అయితే కేవ‌లం అరికాళ్లు ప‌ట్టుకుని అటూ ఇటూ ఊగేసాడు. బాడీలో ఏమైనా స్ప్రింగులు కానీ పెట్టుకున్నాడో ఏమో కానీ ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిప్పేస్తున్నాడు ఈ అల్లు వార‌బ్బాయి. ఇక మొన్న విడుద‌లైన ఇరగ ఇర‌గ పాట చూస్తుంటే థియేట‌ర్స్ లో ఇర‌గ‌దీయ‌డం ఖాయం అని అర్థ‌మైపోతుంది. అను ఎమ్మాన్యువ‌ల్ అందాల‌తో పాటు నోట్లో చుట్ట పెట్టుకుని బ‌న్నీ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. మొత్తానికి మే 4న సినిమా విడుద‌ల కానుంది. మ‌రి రేపు థియేట‌ర్స్ లో ఇంకెంత‌గా ర‌చ్చ చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories