English   

బన్నీ చాచి కొట్టాడుగా..?

Allu-Arjun
2018-04-09 17:55:18

అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న బన్నీ.. లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి డైలాగ్ ఇంపాక్ట్ ప్రోమో విడుదల చేశారు. ముందు నుంచీ చెబుతున్నట్టుగానే ఇది చాలా ఇంపాక్ట్ చూపించింది. సినిమాలో అతని క్యారెక్టరైజేషన్ ను ఇండికేట్ చేసేలా  ఉందీ ఇంపాక్ట్ ప్రోమో. ఓ పబ్ లో చిన్న గొడవ. ఆ గొడవ నుంచి ఒకడు ‘సౌత్ ఇండియా కా సాలా’ అంటాడు.. అంటే వాన్నీ, వాడితో పాటు ఉన్నవాళ్లను చాచిపెట్టి కొట్టేస్తాడు. అంతేనా.. వాడి దగ్గరగా వెళ్లి పబ్ లైట్స్ ఫేస్ నిండా పడుతోంటే.. ‘‘సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్.. అన్ని ఇండియాలు లేవురా మనకి.. ఒక్కటే ఇండియా.. అంటాడు. బర్త్డ్ డే కదా.. ఈ మాత్రం పంచ్ ఉండాల్సిందే అన్నట్టుగా రిలీజ్ చేశారేమో ఈ ప్రోమో అనేలా ఉంది. అతని ఇంటెన్సిటీ, డైలాగ్స్ ను బట్టే ఈ సూర్య దేశాన్ని ఎంత ప్రేమిస్తాడో తెలుస్తుంది. ఇన్నాళ్లూ రైటర్ గా స్టార్డమ్ తెచ్చుకున్న వక్కంతం వంశీ ఈ మూవీతో మెగాఫోన్ పట్టాడు. బన్నీ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసిన సూర్య.. మే 4న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సో.. ఇప్పటి వరకూ సమ్మర్ చాలా రికార్డ్స్ తో దూసుకుపోతోంది. అందులో సూర్య ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. 
 

More Related Stories