English   

సినిమా కార్మికులకు 20 లక్షల విరాళం ఇచ్చిన అల్లు అర్జున్..

Allu Arjun
2020-03-30 16:52:30

తెలుగు హీరోలు కరోనా వైరస్ బాధితులకు భారీగానే విరాళాలు ఇస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇవ్వనంత స్థాయిలో ఇప్పుడు ఒక్కొక్కరూ కోట్ల రూపాయలు దానం చేస్తున్నారు. ఇక ఇప్పుడు సినిమా కార్మికులను ఆదుకొనే కార్యక్రమం మొదలు పెట్టారు. ఒకవైపు ప్రజలతో పాటు మరోవైపు తమ సినిమాల కోసం పనిచేసే కార్మికులకు కూడా భారీగానే విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా చాలా మంది సినిమా కార్మికుల కోసం విరాళం ఇచ్చారు. 

ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన వంతుగా 20 లక్షలు సాయం చేశాడు. దీనికంటే ముందు ఆయన కోటి 25 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధితో పాటు కేరళకు విరాళంగా ఇచ్చాడు. మిగిలిన హీరోలతో పోలిస్తే కాస్త ఆలస్యంగా విరాళం ప్రకటించాడు కానీ అందరి కంటే కాస్త ఎక్కువగానే ఈయన డొనేట్ చేసాడు. ఇక ఇప్పుడు సినిమా కార్మికుల కోసం మరో 20 లక్షలు అదనంగా ఇచ్చాడు. అంతే కాకుండా ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని.. బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దు అని సూచించాడు. 21 రోజుల యుద్ధం కరోనా వైరస్ ను తుదముట్టించడానికి అని గుర్తు పెట్టుకోవాలి అని చెప్పాడు అల్లు అర్జున్. మొత్తంగా కరోనా వైరస్ బాధితుల కోసం కోటి 45 లక్షలు విరాళంగా ఇచ్చాడు అల్లు అర్జున్.

More Related Stories