English   

సుకుమార్ సినిమా మీద ఫోకస్ పెట్టిన బన్నీ

Allu Arjun
2020-01-17 10:34:41

ఈ సంక్రాంతికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. సంక్రాంతికి విడుదల అయిన ఈ సినిమా మీద మొదటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను బన్నీ అందుకున్నాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో బన్నీ సినిమా ఉండబోతోంది. ఈ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో మొదలయింది, బన్నీ లేకుండా ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసేసాడు సుకుమార్.  బన్నీ కాంబినేషన్ లోని లేని సీన్స్ ని ఇతర ఆర్టిస్టులపై చిత్రీకరించారు. వచ్చేనెల మొదటివారం నుంచి రెండో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో బన్నీ పాల్గొననున్నాడని అంటున్నారు.

తన గత చిత్రం రంగస్థలం చిత్రంలో 1980 కాలం నాటి విలేజ్ ని దింపేసిన సుక్కు బన్నీ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ ని టార్గెట్ చేశాడు. కధాపరంగా ఈ సినిమాలోని ఎక్కువ సన్నివేశాలు ఫారెస్ట్ లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం సుకుమార్ ప్రత్యేకంగా కొందరు ఆర్టిస్టులని అది కూడా పెద్దగా ముఖ పరిచయం లేని వారిని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా కూడా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది.  

More Related Stories