English   

గెస్ట్ పాత్రలో అల్లు అర్జున్...?

Allu-Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా విషయంలో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అతను నెక్ట్స్ చేయబోయే ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. కానీ లేటెస్ట్ గా ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదే అల్లు అర్జున్ ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడని. అది కూడా తన సినిమాలో తన కోసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఓ స్టార్ సినిమాలో. యస్.. ఈ వార్త ప్రస్తుతం ఫిలిమ్ నగర్ లో హల్చల్ చేస్తోంది. ఆల్రెడీ రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్రలో అదరగొట్టిన బన్నీ ఈ సారి కూడా మరోపవర్ ఫుల్ రోల్ చేయబోతున్నట్టు టాక్. కాకపోతే ఇది మరీ లెంగ్తీ కాదంటున్నారు.

ఇంతకీ బన్నీ చేయబోతోన్న ఆ గెస్ట్ రోల్ ఏ సినిమాలోనో తెలుసా.. ‘ఆపరేషన్2019’.. అవును శ్రీకాంత్ హీరోగా నటిస్తోన్న ఆపరేషన్ 2019లోనే బన్నీ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇది చిన్న సినిమా. అయినా చేయడానికి కారణం శ్రీకాంతేనట. శ్రీకాంత్ కు మెగా ఫ్యామిలీకి మంచి సంబంధాలున్నాయి. అలాగే శ్రీకాంత్ కూడా అల్లు అర్జున్ సరైనోడులో పెద్దగ ప్రాధాన్యం లేని పాత్ర అయినా నటించాడు. అంతేకాక ఈ సినిమాకు శ్రీకాంత్ నిర్మాత కూడా. ఈ కారణాలతోనే బన్నీ గెస్ట్ రోల్ చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజాలెన్నో కానీ.. ఆ సినిమా ట్రైలర్ కరెక్ట్ గా చూస్తే కొంత వరకూ మేటర్ క్లియర్ అవుతుందేమో ట్రై చేసి చూడండి.. 

More Related Stories