English   

కో డైరెక్టర్ తో బన్ని గొడవ...ఆగిన షూట్ !

Allu Arjun
2019-07-20 10:49:12

త్రివిక్రమ్ శ్రీనివాస్ – బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ అర్దాంతరంగా ఆగినట్టు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలీదని అంటున్నారు. మామూలుగా సినిమా షూట్ ఆగడం పెద్ద విషయం కాదు కానీ దానికి కారణమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షూటింగ్‌లో బన్నీకి త్రివిక్రమ్ కు బాగా క్లోజ్ అయిన ఓ సీనియర్ మోస్ట్ కో-డైరెక్టర్‌కు గొడవ జరగటమే కారణం అని అంటున్నారు. దర్శక దిగ్గజం ఎంఎస్ రెడ్డి దగ్గర నుంచి రాజమౌళి వంటి వారి వరకూ ఎంతో మంది దగ్గర పనిచేసిన సీనియర్ కో డైరక్టర్ ఒకరు ఈ సినిమాకి కూడా కో డైరెక్టర్ గా చేస్తున్నాడట. అయితే ఒక సీన్‌ తెరకెక్కించే సందర్బంగా ఒక డైలాగ్‌ కుదరక మళ్ళీ రాయమంటే అవసరం లేదని అన్నారని అలా ఆ మాటలు చిలికి చిలికి గాలి వానగా మారినట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంతో త్రివిక్ర‌మ్ సైతం షాక్‌కు గురైన‌ట్టు తెలుస్తోంది. బన్నీతో వివాదం వలన ఆ సీనియర్ కో-డైరెక్టర్ దర్శకుల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నాడట. అయితే ఆయనతో మాట్లాడి రాజీ చేసిన త్రివిక్రమ్ కో డైరెక్టర్‌ను సినిమా నుండి తప్పించినట్లు చెబుతున్నారు. దాంతో సినిమా మళ్లీ రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లబోతుందని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి ?

More Related Stories