English   

ఏంటయ్యా ప్రతి ఈవెంట్ లో ఇది.. వైరల్ అవుతున్న బన్నీ కామెంట్స్..

Allu Arjun
2021-03-10 13:58:16

తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఉంటాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తర్వాత స్వతహాగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు బన్నీ. అల వైకుంఠపురంలో సినిమా అల్లు అర్జున్ ఇమేజ్ మరింత పెరిగింది. అప్పటి నుంచి బన్నీ బయట మాట్లాడే విధానం కూడా మారిపోయింది. ముఖ్యంగా ఫంక్షన్లకు వచ్చినప్పుడు అల్లు అర్జున్ మాట తీరు ఆకట్టుకుంటుంది. తనకు అభిమానులు లేరు ఆర్మీ ఉంది అంటూ చెప్తున్నాడు ఈయన. 

ఈ విషయం పక్కన పెడితే ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా కూడా ఇక్కడ దీంతో కొంతమంది అభిమానులు స్టేజిపైకి దూసుకొని వచ్చేస్తుంటారు. అక్కడ చుట్టూ గోడలా చాలామంది బౌన్సర్స్ కాపలాగా ఉన్న వాళ్ళ కళ్ళు కప్పి మరి హీరోల దగ్గరికి వస్తుంటారు. ఈ మధ్య కాలంలో అలాంటి సన్నివేశాలు చాలా చూస్తున్నాం. స్టేజ్ పై మాట్లాడుతున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు.. సడన్ గా వచ్చి కాళ్ళమీద పడుతుంటారు అభిమానులు. అది చూసి అక్కడ ఉన్న బౌన్సర్స్ వాళ్లను లాగేస్తుంటారు. 

మొన్న నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు చావు కబురు చల్లగా ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతుంటే ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు అభిమానులు దూసుకొని వచ్చారు. అందరినీ దాటుకుంటూ బన్నీ కాళ్ల మీద పడ్డారు. ఇది చూసి ఏంటయ్యా ప్రతి ఈవెంట్ లో ఇది అంటూ అసహనం వ్యక్తం చేశాడు. కావాలని పంపిస్తున్నారా లేకపోతే ప్రతిసారి ఎలా జరుగుతుంది ఇది అంటూ ప్రశ్నించాడు అల్లు అర్జున్. అయినా కూడా మూడు నాలుగు సార్లు అభిమానులు పైకి దూసుకొచ్చిన వాళ్లందరికీ ఓపికగా సమాధానం చెప్పాడు అల్లు అర్జున్. దాంతో అక్కడ ఉన్న మిగిలిన అభిమానులు కేరింతలతో ఆడిటోరియం హోరెత్తించారు.

More Related Stories