English   

అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు.. రంగస్థలం ఔట్..

 Allu Arjun
2020-01-27 12:52:41

అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ ఇండస్ట్రీ రికార్డు కొట్టేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటించిన అల వైకుంఠపురంలో సినిమా రెండు వారాలు ముగిసిన తర్వాత కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్పటివరకు 140 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ కావడంతో అల వైకుంఠపురంలో సినిమా అద్భుతంగా ఆడేస్తోంది. 

ముఖ్యంగా థియేటర్లు ఈ సినిమాకు ఎక్కువగా ఇచ్చారు. అల్లు అరవింద్ వెనక ఉండటంతో అల వైకుంఠపురంలో సినిమాను అడ్డుకునే వారే లేకుండాపోయారు.  డిస్కో రాజా లాంటి కొత్త సినిమా ఈ వారం విడుదలైన కూడా ప్రేక్షకులు అటువైపు అసలు చూడటం లేదు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాను పూర్తిగా డామినేట్ చేసి సంక్రాంతి క్లియర్ విన్నర్ అయిపోయాడు అల్లు అర్జున్. నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు బన్నీ. ఈ సందర్భంగా మేకర్స్ పోస్టర్ కూడా విడుదల చేసుకున్నారు. 

ఇందులో అల్లు అర్జున్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రమోట్ చేసుకుంటున్నారు. కింద బ్రాకెట్లో చిన్నగా నాన్ బాహుబలి అంటూ రాసుకున్నారు కూడా. అంటే బాహుబలి రికార్డులు పక్కన పెడితే మిగిలిన అన్ని రికార్డులు తన పేర రాసుకున్నాడు అల్లు అర్జున్. రంగస్థలం సినిమా సృష్టించిన రికార్డులను తిరగరాశాడు బన్నీ. ఇక సైరా నరసింహారెడ్డి రికార్డులను కూడా 10 రోజుల్లోనే పక్కన పడేసాడు అల్లు అర్జున్. ఏదేమైనా కూడా ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకున్నాడు అల్లు వారబ్బాయి. ఇప్పటి వరకు 14 రోజుల్లో ఈ సినిమా 145 కోట్ల షేర్ వసూలు చేసింది.  

More Related Stories