English   

బన్నీ వాళ్ల‌కు రుణ‌ప‌డిపోయాడు..

allu arjun
2018-03-01 13:25:13

అల్లుఅర్జున్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడు. ఆయ‌న ఫాలోయింగ్ చూసి మిగిలిన సౌత్ ఇండియ‌న్ హీరోలు కూడా కుళ్లుకునే స్టేజ్ లో ఉన్నారు. ఎందుకంటే ఫేస్ బుక్ లో మ‌నోడి ర‌చ్చ అలా ఉంటుంది మ‌రి. ఫేస్ బుక్ లో బ‌న్నీ కంటే తోపులు ఎవ‌రూ లేరు. ఇక ఈ మ‌ధ్యే ట్విట్ట‌ర్ కూడా ఓపెన్ చేసాడు బ‌న్నీ. వ‌చ్చి చాలా త‌క్కువ స‌మ‌య‌మే అయింది. దానికి ముందు అన్నీ ఫేస్ బుక్ లోనే షేర్ చేసుకునే బ‌న్నీ.. ఇప్పుడు ట్విట్ట‌ర్ ని కూడా వాడుకుంటున్నాడు. బ‌న్నీకి ఇప్పుడు ట్విట్ట‌ర్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. ఈయ‌న ట్విట్టర్‌ ఖాతా ఫాలోవర్స్‌ 20 లక్షలకు చేరింది. దాంతో అల్లు అర్జున్‌కి తన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ వేస్తున్నారు. దానికి బ‌న్నీ కూడా స్పందిస్తున్నాడు. తన ట్విట్టర్ నుంచే అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాడు. ఫాలోయ‌ర్స్ సంఖ్య 20 లక్షలు చేరుకున్నందుకు పేరు పేరునా అంద‌రికీ థ్యాంక్స్ చెప్పాడు బ‌న్నీ. నన్ను ఫాలో అవుతున్న 2 మిలియన్ ఫాలోవర్స్‌కి ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ప్రేమ, సపోర్ట్‌కు కృతజ్ఞతలు అంటూ బన్నీ ట్వీట్ చేసాడు. ప్ర‌స్తుతం ఈ హీరో నా పేరు సూర్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మే 4న విడుద‌ల కానుంది.

More Related Stories