English   

బ‌న్నీ కోసం వాళ్లంత ప‌ని చేసారు..!

Allu-Arjun
2018-05-01 16:09:16

మీకు మేం ఏమిచ్చి రుణం తీర్చుకోగ‌లం చెప్పండి.. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ‌కు జీవితాంతం రుణ‌ప‌డిపోయినా కూడా త‌క్కువే అంటుంటారు మ‌న హీరోలు. వాళ్లు ఆ మాట‌లు ఎక్క‌డ్నుంచి అన్నా కూడా అవైతే అక్ష‌ర‌స‌త్యం. అభిమానుల రుణం తీర్చుకోవ‌డం వాళ్ల వ‌ల్ల కాదు. న‌చ్చితే వాళ్లు ఎంత దూర‌మైనా వ‌స్తారు. ఇప్పుడు అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కూడా ఇదే చేసారు.. సారి సారి.. వ‌చ్చింది మ‌ల్లు అర్జున్ ఫ్యాన్స్. గ‌చ్చిబౌలిలో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు వేర్వేరు ఊళ్ల నుంచి వ‌చ్చారంటేనే అయ్య బాబోయ్ ఏంట్రా బాబూ ఆ పిచ్చి అంటాం. కానీ మ‌ల్లు అర్జున్ కోసం ఏకంగా కేర‌ళ నుంచి బ‌స్సులేసుకుని మ‌రీ వ‌చ్చారు ఈవెంట్ చూడ్డానికి. ఓ పెద్ద బ్యాన‌ర్ క‌ట్టుకుని వి ల‌వ్ మ‌ల్లు అర్జున్ అంటూ త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. ఒక్క‌రు ఇద్ద‌రు కాదు.. బ‌స్సు నిండా కేర‌ళ నుంచి వ‌చ్చారు. మ‌ళ్లీ ఫంక్ష‌న్ అయిపోగానే రోడ్డు మార్గం ద్వారానే స్టార్ట్ అయ్యారు. ఈ ఒక్క సీన్ చాలు.. మ‌ళ‌యాలంలో అల్లుఅర్జున్ కు ఉన్న ఫ్యాన్ బేస్ ఎలా ఉందో చెప్ప‌డానికి. అక్క‌డ మ‌నోడి సినిమా వ‌స్తుందంటే చాలు.. అక్క‌డి యంగ్ హీరోలు కూడా భ‌య‌ప‌డుతుంటారు. అంత‌గా అభిమానం సంపాదించుకున్నాడు అల్లు వార‌బ్బాయి. ఇప్పుడు నా పేరు సూర్య ఈవెంట్ తో ఇది మ‌రోసారి ప్రూవ్ అయింది. 

More Related Stories