English   

బ‌న్నీ అనే నేను.. అన్నీ నిజాలే చెప్పాను..!

allu-arjun
2018-05-03 12:16:41

ఏ విష‌యంలో అనుకుంటున్నారా..? ఈ మ‌ధ్య మ‌న హీరోలు గొప్ప‌లు చెప్పుకోవ‌డం మానేసారు లెండీ..! పైగా వాళ్ల‌ను పొగ‌డ‌డం కూడా త‌క్కువ చేసారు. చెప్తే న‌మ్మేలాగే పొగుడుతున్నారు కూడా. ఈ మ‌ధ్యే నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక‌లో కూడా బ‌న్నీ చేసిన ఓ డాన్స్ గురించి అంతా తెగ పొగిడేసారు. టోపీతో ఈయ‌న అరాచ‌కాలు మామూలుగా లేవు. అది అలా తిప్పేసాడు మ‌రి. దాని గురించి చెబుతున్న‌పుడు ఏంటి ఇంత‌గా పొగిడేస్తున్నారు బ‌న్నీ గురించి.. నిజాలే చెబుతున్నారా అంటే గ్యాస్ కొడుతున్నారా హీరో కాబ‌ట్టి అనుకున్నారంతా. పైగా ఆ పాట‌లో ఆయ‌న చేసిన టోపీ స్టెప్పులు కూడా కాస్త గ్రాఫిక్స్ మాదిరే ఉన్నాయి. అయితే ఇవ‌న్నీ నిజాలే అన్ని అప్పుడే చెప్పారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్పుడు దానికి ప్రూఫ్ వ‌చ్చింది. టోపీతో బన్నీ చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు విడుద‌లైంది. అందులో బ‌న్నీ ప‌డిన క‌ష్టాన్ని చూసి అయ్యో అనుకుంటున్నారు అభిమానులు. అంత‌గా క‌ష్ట‌ప‌డ్డాడు కాబ‌ట్టే పాట‌లో అంత ప‌ర్ ఫెక్ష‌న్ వ‌చ్చింది. మొత్తానికి బ‌న్నీ అనే నేను.. అన్నీ నిజాలే చెప్పాను అన్నాడు అల్లు అర్జున్. మే 4న టోపీ విన్యాసాలు పూర్తిగా థియేట‌ర్స్ లో చూడొచ్చు.


 

More Related Stories