English   

బ‌న్నీ స‌రైనోడే కాదు.. తెలివైనోడు..!

Allu-Arjun

అవును.. ఇప్పుడు ఇదే అనిపిస్తుంది చూస్తుంటే. కావాలంటే ఒక్క‌సారి రీల్ వెన‌క్కి తిప్పుకోండి. వారం రోజుల కింద జ‌రిగిన నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక‌లో బ‌న్నీ మాట‌లు ఒక్క‌సారి రివైండ్ చేసుకుంటూ అత‌నెంత తెలివైనోడే అర్థ‌మ‌వుతుంది. ఆ వేడుక‌లో నా పేరు సూర్య గురించి మాట్లాడాలి అనుకున్న‌పుడు పూర్తిగా క్రెడిట్ అంతా ద‌ర్శ‌కుడు వంశీకే ఇచ్చేసాడు. అస‌లు త‌నదేం లేద‌ని.. తానేం చెబితే అదే చేసాన‌ని ప‌దే ప‌దే చెప్పాడు. దానికి కార‌ణం ఏంటో ఇప్పుడిప్పుడే అభిమానుల‌కు కూడా అర్థ‌మ‌వుతుంది. సినిమాకు ఇప్పుడు టాక్ తేడాగా వ‌చ్చింది. ఈ చిత్రంలో సీరియ‌స్ కంటెంట్ ఉంది కానీ తీయ‌డంలో మాత్రం వ‌క్కంతం ఆక‌ట్టుకోలేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రేక్ష‌కులు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. రేపు విడుద‌లైన త‌ర్వాత బ‌న్నీ వేలు పెట్టాడేమో అందుకే సినిమా చెడిపోయింది అంటారేమో అని ముందే గ్ర‌హించి.. తానేం చేయ‌లేదు అంతా ద‌ర్శ‌కుడే చేసాడు.. త‌న సినిమా క్రెడిట్ అంతా ద‌ర్శ‌కుడికే ఇచ్చేయాల‌ని చెప్పాడు బ‌న్నీ. దీన్నిబ‌ట్టి విడుద‌ల‌కు ముందే ద‌ర్శ‌కుడిని సెంట‌ర్ చేస్తే అయిపోతుంది. సినిమా హిట్టైతే హ్యాపీ.. ఎలాగూ బ‌న్నీకే పేరొస్తుంది. ఒక‌వేళ సినిమా తేడా కొడితే మాత్రం ద‌ర్శ‌కుడే సెంట‌ర్ అవుతాడు. ఇప్పుడు అల్లు అర్జున్ చేసింది కూడా ఇదే. ఇప్పుడు చెప్పండి బ‌న్నీ తెలివైనోడే క‌దా..!

More Related Stories